ఎన్నికలు ఈవీఎంలతో జరిగినా, బ్యాలెట్ పద్ధతిలో జరిగినా ప్రజల తీర్పు మాత్రం కూటమికే అనుకూలంగా ఉందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు సాధించిన అఖండ విజయమే దీనికి నిదర్శనమని అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, శాంతియుతంగా జరగడం సంతోషకరమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు తమ ఓటుతో మద్దతు తెలిపారని చెప్పారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గెలుపును ప్రజాస్వామ్య విజయంగా అభివర్ణించిందని, ఓడిపోయినప్పుడు మాత్రం ఈవీఎంలపై నిందలు వేస్తోందని పెమ్మసాని విమర్శించారు. ఇప్పుడు బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరిగినా కూటమి అభ్యర్థులే విజయం సాధించారని గుర్తుచేశారు.
ప్రజల మద్దతు కూటమి ప్రభుత్వానికి ఉందని తాజా ఫలితాలు మరోసారి నిరూపించాయని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈవీఎం అయినా బ్యాలెట్ అయినా ఓటమికి వైసీపీ సాకులు వైసీపీ కి ఉంటాయి సుమీ…! నాడు ట్యాపరింగ్ నేడు రిగ్గింగ్ అంతేగా…?





