పెళ్లికి ప్రభాస్ ఒప్పుకోవడం లేదా?

prabhas no for weddingబాహుబలి సిరీస్ తో అందనంత ఎత్తుకు చేరుకున్నాడు ప్రభాస్. ఇప్పుడు దేశం మొత్తం ఆయన పేరు మారు మోగిపోతుంది. ప్రస్తుతం సాహో చిత్రం షూటింగ్ తో బిజీగా ఉన్న ప్రభాస్ పెళ్లి గురించే ఇప్పుడు అందరు ఎదురు చూస్తున్నారు. బాహుబలి తరువాత పెళ్లి చేసుకుంటాడని చాలా సార్లు చెప్పిన కృష్ణంరాజు కూడా ఇప్పుడు మాట మార్చేశారు.

ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ పెళ్లి గురించి ఆయనని అడగగా, “ప్రభాస్‌ పెళ్లికి ‘ఎస్‌’ అని చెబితే చాలు జాతకాలు చూడటం మొదలు పెడతాం. ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నాం”, అని అన్నారు ఆయన. దీనిబట్టి పెళ్లికి ప్రభాస్ ఒప్పుకోవడం లేదనే అనుకోవాలి. ఇప్పటికే 30వ పడిలో ఉన్న ప్రభాస్ పెళ్లి గురించి మాత్రం ఆయన కుటుంబసభ్యులకు ఆత్రంగా ఉందట.

ADVERTISEMENT

తొందర్లోనే సాహూ షూటింగ్ కోసం దుబాయ్ వెళ్లబోతున్నాడు ప్రభాస్. ప్రస్తుతం అక్కడ లొకేషన్స్ హంట్ జరుగుతుంది. తెలుగు, తమిళ, మళయాళం, హిందీ బాషలలో విడుదల అయ్యే ఈ సినిమా 2019 సంక్రాంతికి విడుదల అయ్యే అవకాశం ఉంది. బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ ప్రభాస్ సరసన నటిస్తుంది.

ADVERTISEMENT
Latest Stories