మహేష్ బావ కోసం ప్రభాస్ ఎంట్రీ!

prabhas promoting bhale manchi roju movieప్రిన్స్ మహేష్ బాబు బావ సుధీర్ బాబు నటించిన “భలే మంచి రోజు” సినిమా ఈ నెల 25వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రీమియర్ షోను 24వ తేదీన హైదరాబాద్ శ్రీరాములు ధియేటర్లో ప్రదర్శించబోతున్నారు. అంటే మరో 24 గంటల్లో తొలి షో పడబోతున్న “భలే మంచి రోజు” చిత్రాన్ని ప్రమోట్ చేసేందుకు ఏకంగా ‘డార్లింగ్’ ప్రభాస్ విచ్చేసారు.

యంగ్ రెబెల్ స్టార్ తో ‘భలే మంచి రోజు’ చిత్ర యూనిట్ జరిపే సరదా సంభాషణలతో ప్రమోషన్ కార్యక్రమాలు ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తున్నాయి. ‘అందాల రాక్షసి’ చిత్ర దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమా దానికి మించిన సక్సెస్ అవ్వాలని ఈ సందర్భంగా ‘డార్లింగ్’ చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. ‘అందాల రాక్షసి’లో ‘బాటిల్స్’ సన్నివేశం తనకు బాగా నచ్చిందని, ఇదే సీన్ గురించి రాజమౌళి గారు కూడా దాదాపు ఒక గంట సేపు చెప్పారని, దర్శకుడుపై ప్రశంసలు కురిపించారు.

ADVERTISEMENT

మొత్తానికి మహేష్ తో కాకుండా వెరైటీగా ప్రభాస్ తో సందడి చేసి ఒక హిట్ ను తన ఖాతాలో వేసుకోవాలను కుంటున్నాడు సుధీర్ బాబు. “ప్రేమకధాచిత్రమ్” తర్వాత సక్సెస్ ఎరుగని సుధీర్, “భలే మంచి రోజు” ఖచ్చితంగా హిట్ ఇస్తుందనే నమ్మకంతో ఉన్నారు.

ADVERTISEMENT
Latest Stories