ప్రకాష్ రాజ్ ఏపీకి వస్తున్నారట.. ఎవరి కోసం?

Prakash Raj Targets Narendra Modi, Amit Shah Over SIR Row

సీజేపీ ఏదైనా అంశం తీసుకొని ఆందోళన మొదలుపెడితే, వెంటనే ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ దానికి సంఘీభావం ప్రకటిస్తూ ట్వీట్స్ వేస్తారు. ప్రెస్‌మీట్లు పెట్టి మాట్లాడుతారు. దాని ఆందోళనలలో పాల్గొంటారు.

అయితే ఇదేమీ తప్పు, నేరం కాదు. కానీ అయన సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నారా? లేక ప్రధాని మోడీ, బిజేపి పట్ల వ్యతిరేకతతో పోరాడుతున్నారా? అనేది ముఖ్యం.

ADVERTISEMENT

నేడు హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్బులో మీడియాతో మాట్లాడుతూ, “ప్రధాని మోడీ, అమిత్ షాలు బిల్లా రంగాల వంటివారు. కేంద్ర ఎన్నికల కమీషనర్‌గా జ్ఞానేష్ కుమార్‌ ;సర్; పేరుతో చేస్తున్న తప్పులు వెనుక వారిద్దరే ఉన్నారు. వారి కనుసన్నలలోనే అయన పనిచేస్తున్నారు,” అంటూ ప్రకాష్ రాజ్ తీవ్ర విమర్శలు చేశారు.

సర్ పేరుతో దేశంలో ఎన్నికల ప్రక్రియ తీరుతెన్నులు సమూలంగా మార్చేసి, ప్రతిపక్షాలను, ప్రజాస్వామ్యాన్ని దెబ్బ తీసేందుకు జరుగుతున్న ఈ కుట్రలని ప్రతీ ఒక్కరూ అడ్డుకోవాలని ప్రకాష్ రాజ్ పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా తాను ఆంధ్రప్రదేశ్‌లో 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో జరిగిన అవకతవకలపై కూడా సర్వే చేయిస్తున్నానని చెప్పారు. ఆ సర్వే రిపోర్ట్ తన చేతికి వచ్చిన తర్వాత ఏపీకి వచ్చి అన్ని విషయాలు మాట్లాడుతానని ప్రకాష్ రాజ్ అన్నారు.

బిజేపితో పొత్తు పెట్టుకున్న పార్టీలు ఏవైనా ప్రకాష్ రాజ్‌కు శత్రువులే. అందుకే అయన తరచూ సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌లను విమర్శిస్తూ ఉంటారు. ఒకవేళ వారికి బదులు జగన్‌ పొత్తు పెట్టుకొని ఉండి ఉంటే, ఆయనని వ్యతిరేకించి ఉండేవారు కదా?

కనుక బిజేపితో పొత్తు పెట్టుకొని కారణంగా వైసీపీ.. దాని అధినేత జగన్‌ని అయన మిత్రుడుగా భావించడం, ఆయనకు అండగా నిలబడేందుకు ప్రకాష్ రాజ్ వస్తున్నట్లు భావించాల్సి ఉంటుంది.

హైదరాబాద్‌లో ఆయన మాట్లాడిన మాటలన్నిటినీ వైసీపీ సొంత మీడియాలో అచ్చేయడం ఆయనకూ వైసీపీకి మద్య బలమైన బంధం ఉందని నిరూపిస్తున్నట్లు ఉంది.

కనుక ప్రకాష్ రాజ్ పోరాటం సర్ ప్రక్రియకు వ్యతిరేకంగానా లేక ప్రధాని మోడీ, బిజేపిలకు వ్యతిరేకంగానా? అంటే సర్ పేరుతో ప్రధాని మోడీ, బిజేపిలకు వ్యతిరేకంగా చేస్తున్న రాజకీయాలు అని అనుకోవాలేమో?

ఇలాంటి వ్యక్తులు, శక్తులు, ఉద్యమాల ప్రభావం వచ్చే ఎన్నికలపై తప్పక ఉంటుంది. కనుక 2019 పునరావృతం కాకుండా కూటమి ప్రభుత్వం జాగ్రత్త పడితే మంచిది.

ADVERTISEMENT
Latest Stories