Jagan Prashant Kishor

విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని, జగన్‌ తన 5 ఏళ్ళ పాలనతో మరోసారి దారుణంగా దెబ్బ తీస్తే ఆయనని ఆ కుర్చీలో కూర్చోబెట్టడానికి తోడ్పడిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్. కానీ మన బంగారం మంచిది కానప్పుడు ప్రశాంత్ కిషోర్‌ లేదా కేసీఆర్‌నో నిందించి ఏం ప్రయోజనం?

జగన్‌కి నవరత్నాలు తామే డిజైన్ చేసి ఇచ్చామని 2024 ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిషోర్ స్వయంగా చెప్పుకున్నారు. అయితే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకొని సంపద సృష్టించి దాంతో సంక్షేమ పధకాలు అమలు చేయాలి కానీ వాటి కోసం లక్షల కోట్లు అప్పులు చేయడాన్ని ఆయన కూడా తప్పు పట్టారు.

Also Read – ‘చెప్పాడు’ బ్రదర్…!

అలాగే రాష్ట్రంలో ‘సంపూర్ణ మద్యపాన నిషేధం’ ఆలోచన అమలుచేయడం అసాధ్యమని జగన్‌కి తాను అప్పుడే చెప్పానని, అందుకే ‘దశలవారీ మద్యపాన నిషేధం’ విధానం ప్రవేశపెట్టారని ప్రశాంత్ కిషోర్ చెప్పారు.

కానీ ఆ విధానంతో జగన్‌ ప్రభుత్వం లక్షల కోట్ల వ్యాపారమే చేసింది. దాంతో పలువురు వైసీపి నేతలు చాలా లాభపడ్డారు.

Also Read – నేతి బీరకాయలో నెయ్యి… పాన్ ఇండియా మూవీలో తెలుగు!

ఈ విషయంలో జగన్‌ కంటే ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు చాలా నిజాయితీగా మాట్లాడటం విశేషం. ఆయన సొంత రాష్ట్రం బిహార్‌లో ‘జన సురాజ్’ అనే సొంత పార్టీ పెట్టుకొని, రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి చాలా డాటా సిద్దం చేసుకున్నారు. వచ్చే శాసనసభ ఎన్నికలలో ఆయన పార్టీ పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటోంది.

ప్రశాంత్ కిషోర్ పాట్నాలో మీడియాతో మాట్లాడుతూ, “బిహార్‌లో సంపూర్ణ మద్యపానం వలన రాష్ట్రంలో కల్తీమద్యం వ్యాపారం పెరిగిపోయింది. సామాన్య ప్రజలు ఆ కల్తీ మద్యం త్రాగుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. బిహార్‌కి సంపూర్ణ మద్యపాన నిషేదం అవసరమే లేదు.

Also Read – దువ్వాడకి జగన్‌ అవసరం లేదా మాధురీ మేడమ్?

అసలు సంపూర్ణ మద్యపాన నిషేదం అమలుచేయడం అసంభవం. మేము అధికారంలోకి వస్తే గంటలోగా రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని రద్దు చేస్తాము. కల్తీ మద్యం వ్యాపారులపై చర్యలు తీసుకొని సామాన్య ప్రజలకి నాణ్యమైన మద్యం అందుబాటులోకి తీసుకువస్తాము,” అని చెప్పారు.

జగన్‌ సంపూర్ణ మద్యపాన నిషేదం… దశల వారీగా నిషేదం, మూడు రాజధానులు, విశాఖ రాజధాని అంటూ రాష్ట్ర ప్రజలను మోసం చేశారు. కానీ ప్రశాంత్ కిషోర్ నిజాయితీగా మద్యపానంపై విధించిన నిషేదాన్ని ఎత్తివేస్తామని ప్రకటించారు. కనుక మద్యపాన నిషేదం పేరుతో మద్యం వ్యాపారాలు చేసుకున్నా జగన్‌ కంటే, నిషేదం ఎత్తివేసి మద్యం వ్యాపారాలను అనుమతిస్తానని చెపుతున్న ప్రశాంత్ కిషోర్ నిజాయితీపరుడే కదా?