బాలీవుడ్ బుల్లితెర సీరియల్ నటి ‘బాలికావధు’ ఫేం ప్రత్యూషా బెనర్జీ ఆత్మహత్య ఉదంతం సంచలనాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాహుల్ రాజ్ సింగ్ పై రకరకాల అభియోగాలు రాగా, ఇండియాలో చట్టాల రీత్యా, ఈ బాబు బెయిల్ పై ప్రస్తుతం బయట స్వేచ్చగా తిరుగుతున్నాడు. ఎంత స్వేఛ్చగా అంటే… డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడేటంతగా..!
ముంబైలోని శాంతాక్రజ్ ప్రాంతంలో పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీలలో రాహుల్ రాజ్ సింగ్ మద్యం సేవించి డ్రైవ్ చేస్తున్నట్లుగా గుర్తించారు. ఈ సమయంలో కారులోనే ఉన్న రాహుల్ మాజీ ప్రేయసి సలోని పోలీసులను బెదిరించడం విశేషం. రాహుల్ చెక్ చేస్తే ఉన్నతాధికారులకు చెప్తామని, తనిఖీలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసులను బెదిరించినట్లుగా తెలుస్తోంది.
ADVERTISEMENT
ADVERTISEMENT



