మారుతీ ‘బస్ స్టాప్’ సినిమాతో కమర్షియల్ హిట్ అందుకున్న ప్రిన్స్, ఆ తర్వాత చాలా సినిమాలు చేసారు గానీ, సరైన గుర్తింపు అయితే లభించలేదు. రొమాంటిక్ జోనర్ లో ఎక్కువ సినిమాలు చేసిన ప్రిన్స్, ‘నేను శైలజ’ వంటి కొన్ని సినిమాలలో క్యారెక్టర్ రోల్స్ కూడా చేసారు. గతేడాది జూనియర్ ఎన్టీఆర్ నిర్వహించిన ‘బిగ్ బాస్’ షోలో కూడా పాల్గొన్న ప్రిన్స్, లేటెస్ట్ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఎంతో క్యూట్ గా కనిపించే ప్రిన్స్, ప్రస్తుతం కండలు తిరిగిన బాడీతో హాట్ లుక్ లో కనిపిస్తూ మగువల మనసు దోచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. జిమ్ ట్రైనర్ తో కలిసి ఉన్న ఈ ఫోటోలో పుష్టిగా ఉన్న శారీరక ధారుడ్యంతో పాటు పెంచిన గడ్డంతో, హీరోగా రీ ఎంట్రీ అవ్వడానికి సిద్ధమవుతున్నట్లు కనపడుతున్నాడు. మరి ఏ సినిమా కోసం కష్టపడుతున్నాడో గానీ, ఒక్కసారిగా ప్రిన్స్ లుక్ నెటిజన్లకు ఓ చిన్నపాటి షాక్ ఇచ్చింది.



