ఫ్యాన్సీపై క్రేజ్… వెనక్కి తగ్గని హీరో…!

Prithviraj Sukumaran spent 7 lakhs for his car fancy numberమలయాళంతో పాటు తమిళ చిత్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో పృథ్వీరాజ్ గతేడాది లంబోర్గిని హరికేన్ కారును కొనుగోలు చేశాడు. ఇంత హై ఎండ్ కారుకి మంచి ఫ్యాన్సీ నెంబరు కావాలని ముచ్చటపడిన పృధ్వీ, కారు నెంబర్ కోసం వేలంపాటలో ఏకంగా 7 లక్షలు వెచ్చించాడు. తద్వారా తనకున్న ఫ్యాన్సీ నెంబరు మోజును తీర్చుకున్నాడు.

ADVERTISEMENT

ఎర్నాకుళం ఆర్‌టీఓ కార్యాలయంలో ఇటీవల KL 07 CN 1 అనే నెంబరును వేలానికి ఉంచారు. ఈ నెంబర్ కోసం వేలంపాట 10 వేల వద్ద ప్రారంభమయింది. చివరకి 7 లక్షల వద్ద పృథ్వీరాజ్ దీనిని సొంతం చేసుకున్నాడు. ఈ లంబోర్గిని కారు ధర సుమారు 3.25 కోట్లు. 2010లో విడుదలయిన ‘విలన్’ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యారాయ్ కు సరసన నటించిన విషయం తెలిసిందే.

దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌టీఓలు వేలంపాటల్లో ఫ్యాన్సీ నెంబర్లను విక్రయించడం ద్వారా మంచి లాభాలను ఆర్జిస్తున్నాయి. మరికొందరు సినిమా స్టార్లు తమకున్న కార్లన్నింటిపైనా ఒకే నెంబరును వాడుతున్నారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ తనకున్న అన్ని కార్లపై 4545 నెంబరు ప్లేటును వాడుతున్నాడు. ఇక కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన కార్లపై 2727 నెంబరును ఉపయోగిస్తుండటం ఫ్యాన్సీ నెంబర్లపై వారికున్న మోజును తెలియజేస్తుంది.

ADVERTISEMENT
Latest Stories