దొంగతనం చేసిన సినీనిర్మాత ‘పుత్రరత్నం’

Producer C Kalyan Son Varun Kumar Booked for Robberyప్రముఖ సినీ నిర్మాత సి.కళ్యాణ్ అలియాస్ ‘చిల్లర’ కళ్యాణ్ కుమారుడు వరుణ్ కుమార్ పై చోరీ కేసు నమోదైంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… హైదరాబాద్, బంజారాహిల్స్ లోని రోడ్ నంబరు 12లో ఎమ్మెల్యే కాలనీలో ట్రాన్స్ పోర్ట్ వ్యాపారి బి.శ్రీనివాస్ నివసిస్తుంటారు. గురువారం సాయంత్రం నాడు తన కుమారుడితో కలిసి ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో ఉన్న స్విమ్మింగ్ పూల్ కు వచ్చి, తన దుస్తులతో పాటు పర్సును కూడా పక్కన పెట్టి శ్రీనివాస్ స్విమ్మింగ్ కు దిగారు.

అనంతరం వచ్చి చూస్తే ఆయన పర్సు మాయమైంది. డెబిట్, క్రెడిట్ కార్డులు సహా ముఖ్యమైన ధ్రువపత్రాలు అందులో ఉండగా, పర్సు చోరీ అయిన గంట సేపటిలోనే తన యాక్సిస్ బ్యాంకు కార్డు నుంచి 1.82 లక్షలు, ఐసీఐసీఐ బ్యాంకు కార్డు నుంచి 27,600 లు వేరే ఖాతాకు బదిలీ అయ్యాయి. ఈ నేపథ్యంలో సదరు వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినీ నిర్మాత చిల్లర కల్యాణ్ కుమారుడు వరుణ్ కుమార్ ఖాతాలోకి ఈ మొత్తం బదిలీ అయినట్లు పోలీసులు గుర్తించారు.

ADVERTISEMENT

సంఘటనా స్థలంలో సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ పర్సును వరుణ్ కుమార్ చోరీ చేసినట్లు తెలిసిందని పోలీసులు పేర్కొన్నారు. ఒక ప్రముఖ నిర్మాత తనయుడు అయ్యి ఉండి ఇలా దొంగతనం చేయడమేంటి? ఇది కేవలం కాసుల కోసం పడిన కక్కుర్తి పనా? లేక గతంలో వీరి మధ్య విభేదాలు ఉన్నాయా? అనేది తేలాల్సి ఉంది. ఆన్ లైన్ ట్రాన్సఫర్ చేస్తే వివరాలు అతి తేలికగా బయటపడతాయని అందరికీ తెలిసిన విషయమే అయినా, చోరీ చేసిన నిందితుడు అదే పని చేయడం వెనుక అసలు నిజమేంటన్నది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

ADVERTISEMENT
Latest Stories