
పవన్ కళ్యాణ్ అంటే నడిచే అగ్నిగోళం…
న్యూటన్… పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు అంటూ చదువుకుంటుంటాం…
వాళ్ళంతా ఎందుకు పవన్ కళ్యాణ్ లాంటి వారు మన ఎదురుగానే ఉన్నారు…
ఒక కుజా… ఒక మట్టి గ్లాసు… ఎంత డౌన్ టు ఎర్త్ అండి బాబు…
ఏంటి… ఇదేదో హీరో ఇంట్రడక్షన్ కోసం సైడ్ క్యారెక్టర్ చెప్తున్న డైలాగ్స్ అనుకుంటున్నారా? కాదులేండి. ఓ ఇంటర్వ్యూలో ’30 ఇయర్స్ ఇండస్ట్రీ’ పృధ్వీ ‘జనసేన’ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకొచ్చిన మాటలు. ఈ డైలాగ్స్ విని పవన్ కళ్యాణ్ ను పృధ్వీ నిజంగా పొగిడారా? లేక సెటైరికల్ గా తిట్టారా? అనుకుంటున్నారా?
సరిగ్గా ఇదే సందేహం ఈ ఇంటర్వ్యూ చూసిన వీక్షకులకు కూడా కలుగుతోంది. నడిచే అగ్నిగోళం… మహామహా శాస్త్రవేత్తలతో పోలుస్తూ పృధ్వీ చేసిన కామెంట్స్ బహుశా అభిమానులకు కూడా పెద్దగా రుచించవేమో అనేలా ఉండడం విశేషం. సినిమాటిక్ ఎలివేషన్స్ లో భాగంగా వీర డైలాగ్స్ చెప్పారు గానీ, అవి సహజత్వానికి చాలా దూరంగా ఉన్నాయని మాత్రం మరిచారు.



