pushpa-2-game-changer-and-vishwambhara

‘తగ్గదేలే..’ అంటూ అల్లు అర్జున్‌, రష్మిక మందన, సుకుమార్ పుష్ప-2తో ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు. వరల్డ్ వైల్డ్ ఫైర్… అంటూ ప్రపంచమంతా కార్చిచ్చు వ్యాపింపజేశారు.

అందరూ ఊహించిన్నట్లే పుష్ప-2కి మంచి పాజిటివ్ టాక్, భారీ కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. సినిమాలో కధ కంటే ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్ ఎక్కువైనప్పటికీ అవి ప్రేక్షకులను, ముఖ్యంగా అభిమానులను చాలా రంజింపజేశాయి.

Also Read – ఆ రెండు పార్టీలకి గేమ్ చేంజర్‌ విశాఖపట్నమే!

అల్లు అర్జున్‌, రష్మిక మందన, ఫహాద్, శ్రీలీల, సునీల్, అనసూయ ప్రతీ ఒక్కరూ ‘తగ్గేదేలే’ అంటూ పోటీ పడి నటించి మెప్పించారు. కనుక పుష్ప-2 కొత్తగా ఎటువంటి రికార్డ్స్ సృష్టించబోతోందనే ప్రశ్నే తప్ప హిట్టా ఫట్టా?అనే ఆలోచనే అనవసరం.

పుష్పతోనే ఉత్తరాది రాష్ట్రాల ప్రేక్షకుల మనసులు దోచుకున్న అల్లు అర్జున్‌, సుకుమార్, ఈసారి పుష్ప-2తో వారి హృదయాలు కొల్లగొట్టారని చెప్పొచ్చు. కనుక ఉత్తరాది రాష్ట్రాలలో పుష్పరాజ్ ప్రతాపం ఏవిదంగా ఉండబోతోందో త్వరలోనే అందరూ చూడబోతున్నారు.

Also Read – సైఫ్‌కి టాలీవుడ్‌ పరామర్శలు, ట్వీట్స్ లేవేంటి?

పుష్ప-2 రిజల్ట్ వచ్చేసింది. కనుక ఇప్పుడు అందరి దృష్టి మరో మెగాహీరో రామ్ చరణ్ చేస్తున్న ‘గేమ్ చేంజర్‌’ సినిమాపైకి మళ్ళడం చాలా సహజం.

శంకర్-రామ్ చరణ్ కాంబినేషన్‌లో ‘గేమ్ చేంజర్‌’ సినిమాపై చాలా భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పుడు పుష్ప-2 ఈ స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేస్తూ, సూపర్ డూపర్ హిట్ అనిపించుకోవడంతో గేమ్ చేంజర్‌ అంతకు మించి ఉంటుందా.. లేదా? ఉండి తీరాలి… లేకుంటే అభిమానులు ‘హర్ట్’ అవుతారు. అవమాన పడతారు కూడా. కనుక రామ్ చరణ్‌ తప్పనిసరిగా ‘గేమ్ చేంజర్‌’గా నిలవాలి.

Also Read – ఈ విందుని జగన్‌ జీర్ణించుకోలేరేమో?

ఇప్పటికే మెగా-అల్లు కుటుంబాల మద్య తీవ్రమైన పోటీ నెలకొంది. ‘అల్లు అర్జున్‌ ముందు చిరంజీవితో సహా మెగా హీరోలు అందరూ దిగదుడుపే,’ అంటూ రాంగోపాల్ వర్మ తీసి పడేసి మెగా ఫ్యామిలీని వారి అభిమానుల అహం దెబ్బ తీసి, వారి మద్య రగులుతున్న చిచ్చుకి ఆజ్యం పోశారు.

పుష్ప-2 ఎఫెక్ట్ చిరంజీవి చేస్తున్న ‘విశ్వంభర’తో సహా తదుపరి సినిమాలపై కూడా ఉంటుంది. ఇప్పుడు అందరూ ముఖ్యంగా అభిమానులు పుష్ప-2తో ఇతర సినిమాలను పోల్చి చూడకుండా ఉండలేరు. చూస్తే అందరికీ చాలా ఇబ్బందికరంగా మారుతుంది.




కనుక పుష్ప-2 ఇప్పుడు టాలీవుడ్‌లో ప్రతీ హీరో, దర్శకుడు తనని తాను నిరూపించుకోవాలసిన పరిస్థితి కల్పించిందని చెప్పక తప్పదు.