కులం పేరుతో అవకాశవాద రాజకీయం… ఆర్. కృష్ణయ్య

Congress Offers Deputy CM Post to R.Krishnaiah?ఆర్ కృష్ణయ్య బీసీ సంఘాల అధ్యక్షుడిగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితుడు. జనాభాలో దాదాపుగా సగం ఉండే బీసీలకు సరైన గుర్తింపు లేదని రాజకీయ ఎదుగుదలే దీనికి సరైన పరిష్కారమని చెబుతూ ఉంటారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు రేజర్వేషన్లకు మద్దతు ఇవ్వాలని, అవి వచ్చే వరకు ఎన్నికలలో ప్రతి పార్టీ బీసీలకు గరిష్టంగా సీట్లు ఇవ్వాలని కృష్ణయ్య డిమాండ్. అయితే ఇదంతా బానే ఉన్నా కొద్దీ సంవత్సరాలుగా కృష్ణయ్య చేస్తున్న పనులు విమర్శలకు తావిస్తున్నాయి.

[m9ad]

ADVERTISEMENT

2014 ఎన్నికలకు కాస్త ముందు ఆయన తెలుగు దేశం పార్టీలో చేరి ఎల్బీ నగర్ లో పోటీ చేసి గెలుపొందారు. విభజనతో తెలంగాణాలో అయోమయంగా ఉన్న తెలుగు దేశం పార్టీ ఆయనను ఏకంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. అయితే ఆ ఎన్నికలలో టీడీపీ ఓడిపోవడం ఆ తరువాత పార్టీలో తనకు సరైన గుర్తింపు లేదని అలిగి పార్టీకి దూరం జరిగారు. ఎమ్మెల్యేగా కొనసాగి వేరే ఏ పార్టీలోకి జాయిన్ కాలేదు (అంత వరకు మెచ్చుకోవాల్సిందే). శాసనసభలో ఆయన స్వతంత్రంగా వ్యవహరించినా ఓటింగు అవసరమైనప్పుడు పార్టీ లైన్ లోనే మెలిగారు.

ఈలోగా తెలంగాణలో ఎన్నికలు వచ్చాయి. తెరాస, కాంగ్రెస్ రెండు పార్టీలు బీసీలకు పెద్ద పీట వెయ్యలేదు. దీనిని నిరసిస్తూ 17న బంద్ కు పిలుపునిచ్చారు కృష్ణయ్య. ఏమైందో ఏమో గానీ బంద్ ను ముందుకు నడిపించలేదు. అయితే ఉన్నఫళంగా కృష్ణయ్యను కాంగ్రెస్ తన మిర్యాలగూడ అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన ఇప్పటికే వరకు కూడా కాంగ్రెస్ లో చేరలేదు. కొద్దీ రోజులు క్రితం కాంగ్రెస్ ను విమర్శించారు కృష్ణయ్య ఆ తరువాత బీసీలకు ఆ పార్టీ ఏం చేసిందని ఆయన అందులో చేరినట్టు? ఇది కులం పేరుతో అవకాశవాద రాజకీయం అంటే ఆయన ఏమి సమాధానం చెబుతారో?

ADVERTISEMENT
Latest Stories