‘గ్రాండ్ ఎంట్రీ’ అనుకుంటే ఇలా అయ్యిందేంటి!

   Raai Laxmi Julie 2 postponedబాలీవుడ్ లో ఎలాగైనా జెండా పాతాలనే ఉద్దేశంతో ‘బోల్డ్ & బ్యూటిఫుల్’ అంటూ “జూలీ 2” సినిమాలో హాట్ హాట్ పాత్రలో నటించిన లక్ష్మీ రాయ్ ఆశలు నెరవేరాలంటే మరికొంత సమయం పట్టేలా కనపడుతోంది. ఈ శుక్రవారం (అక్టోబర్ 6వ తేదీన) విడుదల కావాల్సి ఉన్న ఈ సినిమా అర్ధాంతరంగా ఆగిపోవడంతో, తీవ్ర నిరుత్సాహంలో మునిగిపోవడం లక్ష్మీ రాయ్ వంతయ్యింది.

ADVERTISEMENT

నిజానికి సెన్సార్ జరుగక ముందు, బోర్డు నుండి ఏమైనా ఇబ్బందులు వస్తాయేమోనని అంచనాలు వేయగా, అలాంటి వాటికి ఆస్కారం లేకుండా అన్ని క్లియర్ అయ్యాయి గానీ, సరిగ్గా విడుదల సమయం వచ్చేసరికి అనుకోని అవాంతరాలు సినిమాను చుట్టుముట్టడం విశేషం. కాపీ రైట్స్ కు సంబంధించి చట్టపరమైన అంశాలతో ఈ సినిమాను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

అలాగే కొత్త విడుదల తేదీని త్వరలోనే అధికారికంగా తెలియజేస్తామని నిర్మాతలు అన్నారు. అయితే రిలీజ్ డేట్స్ వాయిదాలు వేసుకున్న సినిమాలపై ప్రేక్షకులలో ఉండే భావన తెలియనిది కాదు. అనుకున్న సమయానికి ఒకటి, రెండు వారాలైతే పర్లేదు గానీ, భారీ మార్పు ఉంటే మాత్రం సినిమాకున్న క్రేజ్ తగ్గిపోయే ప్రమాదం పొంచి ఉంది. అందులోనూ ఇప్పటికే ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ తో సహా అన్ని విడుదల చేసేసారు కూడా!

ADVERTISEMENT
Latest Stories