నేను మీరు కోరుకున్నట్టు ఉండేదాన్ని కాదు – రాశిఖన్నా!

Raasi Khanna Latest Interviewనేను నా జీన్స్ పరిమాణమంత కూడా లేను…
నా చిరు నవ్వంతే ఉన్నాను.
నేను మీరు కోరుకున్నట్టు ఉండేదాన్ని కాదు…
నేను నాలానే ఉంటాను.
ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీగా మారిన రాశి ఖన్నాలోని మరో యాంగిల్ ఇది. ఇప్పటివరకు సిల్వర్ స్క్రీన్ పై అందాలు ఆరబోయడమే తెలుసనుకున్న రాశి ఖన్నాలో కవయిత్రి కూడా దాగి ఉందని చాటిచెప్తున్న కవిత ఇది. ఇలా అప్పుడప్పుడు రచనలు చేస్తుంటానని రాశీ ఖన్నా ఓ ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది.

ఆడవారి అందంలో ప్రమాణాలను నిర్దేశించరాదు. ఒకరికి అందంగా అనిపించినది మరొకరికి అనిపించకపోవచ్చు. అందంకోసం కష్టపడడం అన్నది హాస్యాస్పదం. ఒకే ఒక వ్యక్తి మనల్ని అందంగా చూడాలనుకుంటారు. అది మనమే. నేను బరువు తగ్గకముందు ‘మీరు కొన్ని కిలోలు తగ్గాలండీ’ అనేవారు. తగ్గిన తరవాత ఇంతకుముందు కంటే చక్కగా కనిపిస్తున్నారని అంటున్నారు. ప్రేక్షకులకు ఎప్పుడూ అభిప్రాయాలు ఉంటుంటాయి.

ADVERTISEMENT

ఈ ఒత్తిళ్లు తట్టుకోలేక నేను బరువు తగ్గలేదు. నా అంతట నేను కోరుకోవడం వల్లే అది సాధ్యమైంది. ఆరోగ్యంగా ఫిట్ గా ఉండాలన్నది నా ఆలోచన. నేను జీరో సైజు కావాలని కోరుకోవడం లేదు. అది నా వల్ల కాదు. నేను కోరుకున్నా గానీ అయ్యే పని కాదని స్పష్టంగా చెప్పింది. ఈ సందర్భంగా అమ్మాయిలుకు ఓ ఉచిత సలహా కూడా ఇచ్చింది… మీరు సరైన మార్గంలో వెళ్ళండి… ఇతర వ్యక్తుల అభిలాషల మేరకు ఏ పని పనిచేయవద్దంటూ పిలుపునిచ్చింది.

ADVERTISEMENT
Latest Stories