కోలీవుడ్ హీరో విజయ్ దళపతి టీవీకే పార్టీతో తమిళనాడు రాజకీయాలలో ప్రవేశించి తొలి దశ ప్రయత్నంలోనే సిఎం అయ్యారు. ఇప్పుడు మరో నటుడు రాఘవ లారెన్స్ కూడా రాజకీయాలలోకి రాబోతున్నారు. ఆయన తిరుచురాపల్లి (తిరుచ్చి)(ఈస్ట్) నుంచి ఉప ఎన్నికలలో పోటీ చేయబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
వాటిపై ఆయన స్పందిస్తూ, “దీని గురించి నా మీడియా మిత్రులు నన్ను కలిసి వివరణ తీసుకోవాలనుకుంటున్నారు. కానీ ప్రస్తుతం నేను ‘బెంజ్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాను. ఈ నెల 10తో నా షూటింగ్ పూర్తవుతుంది. మా అమ్మ ఆశీర్వాదంతో నేను నా జీవితంలో ఒక ముఖ్య నిర్ణయం తీసుకోబోతున్నాను. జూన్ 11న ఉదయం 9.30 గంటలకు నేను దీని గురించి ప్రకటిస్తాను,” అని ట్వీట్ చేస్తూ తన తల్లితో దిగిన ఫోటోని పోస్ట్ చేశారు.
కొత్తగా రాజకీయాలలోకి రావాలనుకున్నవారు సాధారణంగా ఎన్నికలకు ముందు వస్తుంటారు. కానీ రాఘవ లారెన్స్ ఎన్నికలు ముగిసిన తర్వాత వస్తున్నారు.
అదీ.. టీవీకే పార్టీ అధినేత, సిఎం విజయ్ వదులుకొబోతున్న తిరుచ్చి(ఈస్ట్) నుంచి ఉప ఎన్నికలలో పోటీ చేయబోతున్నట్లయితే బహుశః విజయ్ ఆహ్వానం మేరకు ఆయన టీవీకే పార్టీలో చేరి అక్కడి నుంచి పోటీ చేస్తుండవచ్చు. సినీ పరిశ్రమలో వారిద్దరి మద్య మంచి స్నేహం ఉంది. టీవీకే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న ఉప ఎన్నిక ఇది.
ముఖ్యంగా అది విజయ్ గెలుచుకున్న సీటు. కనుక ఉప ఎన్నికలో తప్పనిసరిగా మళ్ళీ యా సీటు గెలుచుకొని తనది గాలివాటం గెలుపు కాదని విజయ్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. కనుక తన రాజీనామాతో ఖాళీ అవుతున్న ఈ స్థానానికి రాఘవ లారెన్స్ సరైనవాడని సిఎం విజయ్ భావిస్తున్నారేమో?
రజనీకాంత్ వీరాభిమాని రాఘవ లారెన్స్. కనుక అయన సూచన మేరకు డీఎంకే తరపున లేదా స్వతంత్ర అభ్యర్ధిగా ఉప ఎన్నికలో పోటీ చేసినా ఆశ్చర్యం లేదు.
రాఘవ లారెన్స్‌కు దేవుడు, భక్తి, ఆధ్యాత్మిక భావనలు చాలా ఎక్కువ. అలాగే అనేక ఏళ్ళుగా సమాజ సేవ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. కనుక కోలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసి ఇకపై భక్తి, సమాజసేవకు అంకితమవుతానని ప్రకటించినా ఆశ్చర్యం లేదు.
రాఘవ లారెన్స్ ఎటువంటి సంచలన నిర్ణయం ఈసుకోబోతున్నారో తెలియాలంటే జూన్ 11న ఉదయం 9.30 గంటల వరకు వేచి చూడాల్సిందే.
Hi everyone, News about me contesting in Trichy East election has been circulating across various media platforms.
All my Media friends have been reaching out to me over phone and requesting to meet me asking for clarification. Since the speculation has grown to a point where I… pic.twitter.com/68ZyN6P0l9
— Raghava Lawrence (@offl_Lawrence) June 7, 2026




