వీడియో సాంగ్ – ‘రాజా’ మెలోడీ బాగుంది!

Raja The Great  Naake Ne Nachesthunna Song టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దసరా శోభ ముగిసి, దీపావళి టార్గెట్ గా అడుగులు పడుతున్నాయి. దీంతో దీపావళికి విడుదల కాబోతున్న సినిమాల ప్రమోషన్స్ పై యూనిట్ వర్గాలు దృష్టి కేంద్రీకరించాయి. అందులో భాగంగా దీపావళికి రాబోతున్న మాస్ మహారాజా రవితేజ “రాజా ది గ్రేట్” సినిమా ప్రమోషన్స్ ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఓ లిరికల్ వీడియోను విడుదల చేయగా, తాజాగా ఓ మెలోడీ పాటకు సంబంధించి వీడియో ప్రోమోను రిలీజ్ చేసారు.

‘నీకే నే నచ్చేస్తున్నా’ అంటూ సాగే ఈ మెలోడీ గానం వినసొంపుగా ఉంది. సాయికార్తీక్ ఆహ్లాదకరమైన సంగీతం అందించగా, దానిని అంతే ఆహ్లాదకరమైన వాతావరణంలో చిత్రీకరించినట్లుగా వీడియో ప్రోమో స్పష్టం చేసింది. రామజోగయ్య సాహిత్యం సమకూర్చగా, సమీర, శృతిలు ఆలపించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫుల్ ఆడియో 4వ తేదీన బుధవారం నాడు ప్రేక్షకులను అలరించడానికి విడుదల కానుంది.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories