మరోసారి “రివ్యూ”ల రచ్చ తప్పదా?

Raja The Great Movie Reviewపెద్ద సినిమాలు విడుదలైన ప్రతిసారి ‘రివ్యూ’లపై ఏదొక విధంగా రచ్చ జరుగుతూనే ఉంది. ఇటీవల దసరాకు విడుదలైన ‘జై లవకుశ’ సినిమా ‘రివ్యూ’లపై ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ బహిరంగంగా వ్యాఖ్యానించగా, ‘స్పైడర్’ సినిమాల సందర్భంలో ప్రిన్స్ అభిమానులు సోషల్ మీడియా ద్వారా చేసిన రచ్చ తెలియనిది కాదు. ఇలా పెద్ద సినిమా విడుదలైన ప్రతిసారి ఏదొక విధంగా ‘రివ్యూ’ అంశం మీడియా వర్గాలలో హైలైట్ అవుతోంది.

ఆ రెండు సినిమాల తర్వాత ‘మహానుభావుడు, రాజు గారి గది 2’ వంటి సినిమాలకు ‘మౌత్ టాక్’తో పాటు రివ్యూలు కూడా అనుకూలంగా రావడంతో ఎలాంటి గోలకు ఆస్కారం లేకుండా పోయింది. కానీ తాజాగా విడుదలైన మాస్ మాహారాజా రవితేజ “రాజా ది గ్రేట్” సినిమాకు అటు ప్రేక్షకుల నుండి, ఇటు సినీ విశ్లేషకుల నుండి భిన్న స్పందనలు, భావాలు వ్యక్తమయ్యాయి. దీంతో మరోసారి సోషల్ మీడియాలో ‘రివ్యూ’ల రచ్చకు తెరలేపే పనిలో రవితేజ అభిమానులు ఉన్నట్లుగా కనపడుతోంది.

ADVERTISEMENT

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… ఇలా రచ్చ జరుగుతున్న ప్రతిసారి స్వయంగా హీరోనే ఒక స్టేట్మెంట్ ఇస్తుండడంతో, ‘రివ్యూ’లకు మరింత ప్రాధాన్యత లభిస్తోంది. మరి మునుపటి హీరోల మాదిరే రవితేజ కూడా రివ్యూలపై కామెంట్స్ చేసి వాటి ప్రాధాన్యతను పెంచుతారో లేదో చూడాలి. మాస్ ఎంటర్టైనర్ గా టాక్ తెచ్చుకున్న ‘రాజా ది గ్రేట్’ ఓపెనింగ్స్ అయితే పర్వాలేదనిపించే స్థితిలోనే ఉన్నాయన్నది ట్రేడ్ టాక్.

ADVERTISEMENT
Latest Stories