ఇటీవల రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో దారుణంగా గాయపడిన ప్రియాంక అనే ఒక మెడికో విద్యార్థి సికింద్రాబాద్ లోని కిమ్స్ లో చికిత్స పొందుతూ చావు బతుకుల మధ్య పోరాటడుతుంది. దుశ్యంత్, విలియం జోసెఫ్ అనే ఇద్దరు యువకులు తాగిన మత్తులో చేసిన ఈ దారుణానికి ఇప్పుడు ఆ విద్యార్థి కుటుంబం తీరని శోకాన్ని అనుభవిస్తుంది.
ఒక మెడికో గా వైద్య సేవలు అందించాల్సిన తన కుమార్తె ఇలా నిర్జీవంగా ICU లో చికిత్స తీసుకోవడం చూసి తట్టుకోలేకపోతున్నాం అంటూ ప్రియాంక తండ్రి తన ఆవేదనను పంచుకుంటున్నారు. తన బిడ్డకు ఈ గతిపట్టించిన వారికీ తగిన శిక్ష వేయాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ప్రియాంక పరిస్థితి, ఆమె కుటుంబ సభ్యుల ఈ దుస్థితి చూసిన ప్రతి ఒక్కరి కన్ను చమర్చాక మానదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం ఈ ఘటన పై స్పందిస్తూ బాధితులకు తన సానుభూతి వ్యక్తం చేస్తూ ఈ దారుణానికి కారకులైన వారి పై కఠిన చార్యులు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు.
ఇక ఇటు ప్రభుత్వం అటు సామాన్య ప్రజానీకం కూడా ఈ దారుణం పై స్పందిస్తూ హిట్ అండ్ రన్ బాధిత కుటుంబానికి తమ సానుభూతు వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి వారి వ్యసనాలు ఎందరో నిండు ప్రాణాలను తీస్తున్నాయి, అనేక కుటుంబాలలో తీరని విషాదాన్ని నింపుతున్నాయి.
అయితే తాజాగా శ్రీకాకుళం జిల్లా కు చెందిన ఆముదాలవలస వైసీపీ మాజీ ఎమ్మెల్యే సిదిరి అప్పలరాజు తనయుడు కూడా ఇటీవల ఒక హిట్ అండ్ రన్ కేసులో చిక్కుకున్నారు. అయితే ఇక్కడ కూడా సిదిరి తనయుడి అజాగ్రత్త వలన 40 ఏళ్ళ ఒక నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది.
కుటుంబ పెద్దను కోల్పోయిన ఆ కుటుంబం, ఆయన ఇద్దరు పిల్లలు తమ పరిస్థితి ఏంటంటూ కన్నీటి రోదన చేస్తున్నారు. అయితే ఇక్కడ వైసీపీ శ్రేణుల నుంచి ఆ పార్టీ అధినేత జగన్ వరకు బాధితుల పక్షాన కాకుండా నిందితుల పక్షాన నిలబడ్డారు.
వారి కోసం పరామర్శ యాత్రలు చేసారు, ఓదార్పు మాటలు చెప్పారు. ఇక వైసీపీ అధినేతగా, ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ హిట్ అండ్ రన్ కు పాల్పడిన ఆ నిందితుడిని వెనకేసుకొస్తూ ఎదో చిన్నపిల్లాడు, తెలిసి తెలియక చేసాడు, అంత మాత్రాన ఆయన మీద కేసులు పెడతారా.? అసలు సీఎం బాబు కి ఏమైనా మానవత్వం ఉందా అంటూ బాధితుల కడుపు కోత కాకుండా నిందితుల వైపు నిలబడ్డారు.
మరి ఇప్పుడు రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో కూడా వైసీపీ స్టాండ్ ఎటువైపు ఉంటుంది.? ఆ పార్టీ పరామర్శ బాధిత ప్రియాంక కుటుంబానికా.? లేక ఎదో యువకులు తాగిన మత్తులో తెలిసి తెలియక ఇలా చేసారు, అంటూ నిందితుల వైపు నిలుస్తుందా.?




