ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ‘పి.ఎస్.వి. గరుడవేగ 126.18 ఎమ్’ చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెప్పారు. రాజశేఖర్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకోవడానికి తోడు, సుదీర్ఘ విరామం తరువాత రాజశేఖర్ ఫాంలోకి వచ్చాడని, కథాకథనాలకు తోడు రాజశేఖర్ నటన హైలైట్ అన్న టాక్ చూసిన వారు చెబుతున్న నేపథ్యంలో స్పందించిన రాజమౌళి ట్వీట్ చేశారు.
ఈ సినిమాకు ఆదివారం షోకి టికెట్లు బుక్ చేసుకున్నానని ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుందని అభినందించారు. దానికి రాజశేఖర్ కూడా స్పందిస్తూ… ‘ధన్యవాదాలు సర్. మీ మాటలు మాకు చాలా బలాన్ని ఇచ్చాయి’ అంటూ ట్వీట్ చేశారు. కాగా ఈ సినిమాలో రాజశేఖర్ తో పాటు పూజా కుమార్, శ్రద్ధాదాస్, కిశోర్, నాజర్, పోసాని కృష్ణమురళి నటించారు. సన్నీలియోన్ స్పెషల్ సాంగ్ అదనపు హంగు.





