ఒక కూలీ… ఒక కండక్టర్… ఒక స్టార్… ఒక సూపర్ స్టార్… ఒక సూపర్ హ్యూమన్… ఇవి రజనీకాంత్ ను నిర్వచిస్తూ విడుదలైన బయోపిక్ టీజర్. బ్యాక్ గ్రౌండ్ లో కమల్ హాసన్ వాయిస్ తో ప్రారంభమైన ఈ టీజర్ లో షారుక్ ఖాన్ వాయిస్ తో ముగుస్తుంది. వివిధ ఇంటర్వ్యూలలో రజనీ గురించి వీరిద్దరు చెప్పిన విషయాలను ఈ టీజర్ కోసం వినియోగించుకున్నారు.
“రజనీ – ఇండియాస్ ఫస్ట్ సూపర్ హ్యూమన్” పేరుతో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన తొలి టీజర్ ఇది. పావి శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కధను రజనీ జీవిత కధ ఆధారంగా తెరకెక్కించారు. అయితే అధికారికంగా రజనీ నుండి సమాచారం సేకరించి తీశారా? లేక తమకున్న సమాచారం మేరకు ఈ సినిమాను తెరకెక్కించారా? అన్నది తెలియాల్సి ఉంది.
ఎందుకంటే రజనీ లాంటి హీరో బయోపిక్ టీజర్ విడుదల అవుతోంది అంటే… ఆ హంగామా మామూలుగా ఉండదు. కానీ, ఈ టీజర్ మాత్రం ఎలాంటి హంగామా లేకుండా విడుదలైంది. అలాగే విడుదలైన తర్వాత కూడా సోషల్ మీడియాలో పెద్దగా స్పందన లేదు. దీంతో ఈ సినిమాకు సంబంధించిన వివరాలు మరింత ఆసక్తికరంగా మారాయి. ఏది ఏమైనా రజనీ ఫ్యాన్స్ కు ఈ సినిమా ఫీస్ట్ లా ఉంటుందనేది చిత్ర యూనిట్ ఇస్తోన్న సమాచారం.



