మరోసారి తెరపైకి రజినీకాంత్ రాజకీయ అరంగేట్రం?

Rajinikanth fans meet -సూపర్ స్టార్ రజినీకాంత్ తన జన్మదినమైన ఈ నెల 12వ తేదీన ఆయన పార్టీ ఏర్పాటు తదితరాలపై ప్రకటన చేస్తారని అభిమానులు ఎదురుచూశారు. కానీ దానికి మౌనమే సమాధానం అయ్యింది. దీనితో అభిమానులంతా ఎంతగానో నిరాశ చెందారు. మరోవైపు ఈనెల 26 వ తేదీ నుంచి అభిమానులతో రజనీకాంత్‌ చెన్నైలో సమావేశం కానున్నారు.

ADVERTISEMENT

ఆరు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలలో రజినీకాంత్ కీలక ప్రకటన చేస్తారని అంతా ఎదురుచూస్తున్నారు. జయలలిత అకాలమరణం తరువాత తమిళ నాట రాజకీయ స్తబ్దత నెలకొంది. మరో వైపు రజిని ఎలాంటి ప్రకటనా చేయలేదనే మనస్తాపంతో సేలానికి చెందిన ఆయన అభిమాని ఆత్మహత్యాయత్నం చేశారు.

సేలం అళగాపురం పారైవట్టం ప్రాంతానికి చెందిన ఏళుమలై (42) మనస్తాపానికి గురైన ఏళుమలై ఇంటిలో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. కుటుంబ సభ్యులు ఆయన్ను సేలం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories