టీజర్ టాక్ – ఫ్యాన్స్ మెప్పించే డైలాగ్స్!

Rajinikanth Kaala movie Teaserతెలుగు రాష్ట్రాల్లోని రజనీకాంత్ అభిమానుల కోసం ‘కాలా’ తెలుగు టీజర్ కూడా వచ్చేసింది. “కాలా అంటే ఎవరు? కాలుడు… కరికాలుడు. గొడవపడైనా సరే కాపాడేవాడు” అన్న బ్యాక్ గ్రౌండ్ వాయిస్ డైలాగుతో పాటు ఓ మధ్యతరగతి కుటుంబ గృహిణి “గొడవేకదా? పెట్టుకుంటాడు పెట్టుకుంటాడు. ఎన్నాళ్లు ఎట్టుకుంటాడో నేనూ చూస్తా” అని వ్యంగ్యంగా అనే మాటలతో రజనీ స్వభావాన్ని చూపించే ప్రయత్నం చేశారు.

ADVERTISEMENT

ఆపై నానాపటేకర్ డైలాగులతో పాటు “నలుపు… శ్రమ జీవుల వర్ణం. మా వాడకొచ్చి చూడు. మురికంతా ఇంధ్రదనస్సులా కనిపిస్తుంది”, “క్యారే… సెట్టింగా? వీరయ్య బిడ్డనురా… ఒక్కడినే ఉన్నా… దిల్లుంటే గుంపుగా రండిరా” అన్న రజనీ డైలాగ్ ఈ టీజర్ లో ఉన్నాయి. చివరిగా “ఈ కరికాలుడి పూర్తి రౌడీయిజాన్ని చూడలేదు కదూ. ఇప్పుడు చూపిస్తా” అన్న డైలాగ్ తో టీజర్ ముగుస్తుంది. ఫ్యాన్స్ ఆశించే మాస్ డైలాగ్స్ సాగిన టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

ADVERTISEMENT
Latest Stories