ఇంత స్మాల్ డైరెక్టర్ తో… ఈ టైం లో..!

Old-Debt-Haunts-Rajinikanth-Political-Entryతమిళనాట రాజకీయాల్లో కమల్ హాసన్ ఎంట్రీ కంటే కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ కోసం అందరూ ఆసక్తిగా గమనిస్తున్న విషయం తెలిసిందే. అతి త్వరలోనే ఈ వార్త ఉంటుందని అనుకుంటున్న తరుణంలో… సూపర్ స్టార్ మరో సినిమాకు అంగీకరించారన్న వార్త చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ఏప్రిల్ 27వ తేదీన “కాలా” విడుదలను సిద్ధం చేసిన రజనీ, మరో పక్కన సెకండాఫ్ లో “2.0 రోబో”తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

ఇలా ఈ ఏడాది రెండు సినిమాలను సిద్ధం చేసిన రజనీ, ‘పిజ్జా, ఇరైవి’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన కార్తీక్ సుబ్బరాజ్ వంటి చిన్న దర్శకుడు చిత్రంలో ఒప్పుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇంత చిన్న దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం… అది కూడా పొలిటికల్ ఎంట్రీకి ముందు కావడం… ఓ రకంగా రిస్క్ తో కూడుకున్నదేనని చెప్పవచ్చు. ఇప్పటివరకు చిన్న హీరోలను మాత్రమే హ్యాండిల్ చేసిన సుబ్బరాజ్, సూపర్ స్టార్ స్టేటస్ కలిగిన రజనీని సరిగ్గా హ్యాండిల్ చేయగలుగుతారో లేదో చూడాలి.

ADVERTISEMENT

అంచనాలు వేసిన విధంగా అన్నీ రజనీకి అనుకూలంగా జరిగితే పర్లేదు గానీ, లేదంటే పొలిటికల్ ఎంట్రీకి ముందు విమర్శల పాలు కావాల్సి ఉంటుంది. అయితే అంత చిన్న డైరెక్టర్ కు ఓకే చెప్పారంటే… కధలో ఎంత బలముందో అనుకోవడం కూడా ఒక వంతు! చిన్న సినిమాలతో డిఫరెంట్ జోనర్స్ తో తెరకెక్కించిన కార్తీక్ సుబ్బరాజ్ సూపర్ స్టార్ ను ఏ జోనర్ లో చూపిస్తారోనని వేచిచూడాలి. అదే పొలిటికల్ యాంగిల్ అయితే… ఫ్యాన్స్ కు అంతమించిన పండగ మరొకటి ఉండదని చెప్పడంలో సందేహం లేదు.

ADVERTISEMENT
Latest Stories