టీజర్ టాక్ – వింత జబ్బుతో వినోదం!

Rajugadu Teaser Talkసినీ వినోదానికి వింత జబ్బులు అడ్డంకి కాదన్న విషయాన్ని మరోసారి “రాజుగాడు” సినిమా నిరూపించే ప్రయత్నం చేస్తోంది. ‘తనకు తెలియకుండానే కనపడినవన్నీ కొట్టేసే ఓ వెరైటీ దొంగ పాత్రలో రాజ్ తరుణ్ కనిపిస్తుండగా, అతని తండ్రిగా నటకిరీటీ రాజేంద్రప్రసాద్ వినోదాన్ని పంచబోతున్నాడు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మే 11వ తేదీన విడుదల చేస్తున్నట్లుగా ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఫస్ట్ టీజర్ ను విడుదల చేసారు.

ADVERTISEMENT

‘ఎంటర్టైన్మెంట్ పక్కా’ అన్న కోణంలో సాగిన ఈ 47 సెకన్ల టీజర్ రాజ్ తరుణ్ వింత జబ్బుతో ఆకట్టుకుంది. సహజంగా ఇలాంటి సబ్జెక్ట్స్ టీజర్, ట్రైలర్ లలో బానే ఉంటాయి గానీ, సిల్వర్ స్క్రీన్ పై మాత్రం ఆకట్టుకోవడానికి ఇబ్బందులు పడుతుంటాయి. మరి వాటిని అధిగమించి ప్రేక్షకులను ఆకట్టుకుంటాడో లేదో తెలియాలంటే మరికొన్నాళ్ళు వేచిచూడాల్సిందే. రాజ్ తరుణ్ సరసన అమైరా దస్తూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సంజనరెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

ADVERTISEMENT
Latest Stories