‘స్వీట్ డ్రీమ్స్’ అంటూ ఈ ‘హాట్’ ఫోటోలేంటి?

Rakul Preet Singh Hot Photoshootటాలీవుడ్ టాప్ హీరోయిన్ గా కొనసాగుతోన్న రకుల్ ప్రీత్ సింగ్ కుర్రకారుకు నిద్రలేని రాత్రులను మిగులుస్తోంది. ముఖ్యంగా గత రెండు రోజుల నుండి తన సౌందర్యాలతో వీక్షకులను కన్నులవిందు చేసిందనే చెప్పాలి. ‘మ్యాగ్జిమ్’ మ్యాగ్ జైన్ కు ఇచ్చిన ఫోటోషూట్ లో ఒక్కో ఫోటో ఒక్కో రేంజ్ లో రకుల్ సోయగాలను ఆవిష్కరించినట్లుగా కనపడుతోంది. మొదటి ఫోటోనే ఒక రేంజ్ లో ఉందని టాక్ రాగా, తాజాగా విడుదల చేసిన ఫోటో ‘అంతకుమించి’ అనే స్థాయిలో రకుల్ అందాలను చూపిస్తోంది.

ADVERTISEMENT

‘స్వీట్ డ్రీమ్స్’ అంటూ రకుల్ పోస్ట్ చేసిన ఈ హాట్ ఫోటోకు నెటిజన్లు నీరాజనం పలుకుతున్నారు. రకుల్ పోస్ట్ చేసిన కాసేపటికే ‘లైక్’ల సంఖ్య లక్ష దాటిపోయిందంటే… ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక రకంగా చెప్పాలంటే… బాలీవుడ్ లో ఇటీవల కలకలం రేపిన ఇషా గుప్తా మాదిరి, టాలీవుడ్ లో రకుల్ హాట్ హాట్ ఫోటోలు అతి పెద్ద చర్చలకు దారి తీసాయి. ఈ ప్రభావం తన సోషల్ మీడియా ఖాతా మీద కూడా పడింది.

ఎందుకంటే… తన హాట్ ఫోటోల ప్రభావంతో రకుల్ ‘ఇంస్టాగ్రామ్’ ఫాలోయర్స్ సంఖ్య ఏకంగా 2.7 మిలియన్స్ కు చేరుకుంది. బహుశా అతి కొద్ది రోజుల్లోనే 3 మిలియన్స్ ను టచ్ చేస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకోసం ఈ అందాల విందు చేసిందో గానీ, ఈ ఫోటోలతో ఒక్క టాలీవుడ్ లోనే కాదు, బాలీవుడ్ లో కూడా రకుల్ పేరు మారుమ్రోగుతోంది. కాలం కలిసి వస్తే…. టాలీవుడ్ ను ఏలుతున్నట్లే… బాలీవుడ్ ను కూడా ఓ ఊపు ఊపుతుందేమో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories