భారీ అంచనాలు పెట్టుకున్న “ధృవ” సినిమా ట్రైలర్ యూ ట్యూబ్ దుమ్ము దులుపుతూ గత రికార్డులను బద్దలు కొడుతూ దూసుకుపోతుంటే… అభిమానుల్లో నూతన ఉత్సాహం ఉరకలేస్తోంది. ఇప్పటికే 3 మిలియన్ ను క్రాస్ చేసిన ఈ ‘ధృవ’ ప్రీ రిలీజ్ వేడుకను డిసెంబర్ 4వ తేదీన నిర్వహించనున్నారన్న విషయం తెలిసిందే. డేట్ ఫిక్స్ అయ్యింది కానీ, వెన్యూ ఖరారు కాకపోయినా… విశాఖ లేదా తిరుపతి ప్రాంతాలలో ఘనంగా ఏర్పాటు చేయాలని భావించారు.
తొలుత విజయవాడ అని వచ్చిన వార్త వరంగల్ కు మారగా, తర్వాత ఈ స్థానంలో విశాఖ, తిరుపతి పేర్లు వినిపించాయి. అయితే తాజాగా హల్చల్ చేస్తున్న సమాచారం ప్రకారం… ఆ రెండు ప్రదేశాలలో కూడా కాకుండా హైదరాబాద్ లోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుకను ఏర్పాటు చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. వెన్యూ ఇంకా ఖరారు చేయలేదు గానీ, 4వ తేదీన హైదరాబాద్ లోనే ఈ ప్రీ రిలీజ్ వేడుక జరగబోతోందన్న విషయం ఖరారైంది.
తమ అభిమాన హీరోను దగ్గర నుండి చూద్దామనుకున్న మెగా అభిమానులకు నిరుత్సాహకరమైన సమాచారం ఇది. అయితేనేం బంపర్ హిట్ కోసం వేచిచూస్తున్న చెర్రీకి, ఆ ముచ్చట తీరితే అంతకు మించి అభిమానులకు కావాల్సింది ఏముంటుంది!? ముఖ్యంగా ట్రైలర్ విడుదల తర్వాత ‘ధృవ’పై అంచనాలు భారీ స్థాయికి వెళ్ళడంతో, కొడితే కుంభస్థలమే అన్న రీతిలో మెగా ఫ్యాన్స్ అంచనాలు నెలకొన్నాయి.



