‘ఆల్ టైం’ రికార్డులు సెట్ చేసిన ‘రామ్ చరణ్’

Ram charan Dhruva Trailer All Time Recordsల్యాండ్ అవడంతోనే మెగా వారసుడు సరికొత్త రికార్డులకు పనిచెప్పాడు. మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన “ధృవ” ధియేటిరికల్ ట్రైలర్ అంచనాలను అందుకోవడంతో… టాలీవుడ్ చరిత్రలోనే సరికొత్త రికార్డులకు తెరలేపాడు ఈ మెగా వారసుడు. ఫాస్టెస్ట్ 1 మిలియన్ క్లిక్స్ అందుకున్న ట్రైలర్స్ జాబితాలో “ధృవ” గత రికార్డులను బద్దలు కొడుతూ నెంబర్ 1 స్థానానికి చేరుకుంది.

కేవలం 5 గంటల లోపే 1 మిలియన్ క్లిక్స్ అందుకోవడం సాధారణ విషయమేమీ కాదు. భారీ మార్కెట్ గల బాలీవుడ్ ట్రైలర్లు, టీజర్లకు కూడా ఒక్కోసారి ఇంత స్పందన రాదు. దీంతో “ధృవ” కోసం ఏ స్థాయిలో మెగా అభిమానులు వేచిచూస్తున్నారో ఈ ట్రైలర్ రికార్డులు చెప్పకనే చెప్తోంది. మొదటి 5 గంటల్లోనే 1 మిలియన్ క్లిక్స్ అందుకున్న “ధృవ” ట్రైలర్, 12 గంటలు గడిచే సమయానికి 1.2 మిలియన్ సంఖ్యకు చేరుకుంది.

ADVERTISEMENT

చూడబోతుంటే… ఈ మెగా వారసుడు బాక్సాఫీస్ రికార్డులకు కూడా పని చెప్పనున్నాడన్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి. సునామీలా దూసుకొస్తున్న ‘ధృవ’ ప్రభంజనం, ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా కొనసాగుతుందా? అనేది మిక్కిలి ఆసక్తికరంగా మారింది. ఓ పక్కన కరెన్సీ కొరతతో దేశ ప్రజలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో కరువు కటకటలాడుతోంది. దీంతో “ధృవ” రిలీజ్ టాలీవుడ్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

ADVERTISEMENT
Latest Stories