మహేష్ బాబు ఎక్కడా కనిపించట్లేదే!

మహేష్ బాబు ఎక్కడా కనిపించట్లేదే! ‘సిద్ధా’ పాత్రతో రామ్ చరణ్ ను పరిచయం చేసిన టీజర్ మెగా అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ముఖ్యంగా టీజర్ లోని లాస్ట్ షాట్ కొరటాల మాస్ ఎలివేషన్ ను నిదర్శనంగా నిలుస్తోంది. ఈ షాట్ తో ఇప్పటివరకు మెగా ఫ్యాన్స్ నిరీక్షణ కొంత ఫలించినట్లయ్యింది.

‘సిద్ధా’ పాత్రలో రామ్ చరణ్ ఒదిగిపోయినట్లుగా ఈ టీజర్ స్పష్టం చేస్తోంది. అయితే ముందుగా ఈ రోల్ ను మహేష్ బాబు చేయబోతున్నాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని దర్శకుడు కొరటాల శివ కూడా స్వయంగా ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.

ADVERTISEMENT

‘ఆచార్య’ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర ఉందని, అది ఓ టాప్ హీరో చేయాలని తాను కంగారు పడుతుంటే, ‘మీరేమి టెన్షన్ పడకండి, అవసరమైతే ఆ రోల్ నేను చేస్తాను’ అంటూ మహేష్ తనకు అభయం ఇచ్చినట్లుగా కొరటాల శివ చెప్పుకొచ్చారు.

మరి ఇప్పుడు ఆ రోల్ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. మరి ఈ ‘సిద్ధా’ క్యారెక్టర్ లో మహేష్ బాబు ఛాయలు ఏమైనా కనపడుతున్నాయా? అంటే… అందుకు తావు లేకుండా రామ్ చరణ్ మాస్ ఇమేజ్ ఈ ‘సిద్ధా’ పాత్రను మరింత ఎలివేట్ చేసినట్లుగా ఉంది.

రామ్ చరణ్ ఈ పాత్రకు పచ్చ జెండా ఊపిన వెంటనే, చెర్రీ ఇమేజ్ కు తగ్గట్లుగా పాత్రను కొరటాల డిజైన్ చేసి ఉండొచ్చు. ఆ మార్పు ఈ టీజర్ లో కనపడుతోంది. మెగాస్టార్ – మెగా పవర్ స్టార్ ను ఒకేసారి స్క్రీన్ పైన చూడాలనుకున్న అభిమానుల కోరిక కూడా “ఆచార్య”తో తీరనుంది.

‘ఓమిక్రాన్’ రూపంలో టాలీవుడ్ కు మళ్ళీ కరోనా ఎలాంటి ట్విస్ట్ లు ఇవ్వకపోతే, ఫిబ్రవరి 4వ తేదీన మెగా అభిమానుల మాస్ జాతరతో “ఆచార్య” ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సర్వం సిద్ధం చేసుకుంది. మణిశర్మ సంగీతం ‘ఆచార్య’కు అదనపు ఆకర్షణ.

 

ADVERTISEMENT
Latest Stories