సినిమాల్లో సింపుల్ మాస్ లుక్… బయట కళ్ళజోడు పెట్టుకున్న క్లాస్ లుక్ లో మెగా వారసుడు రామ్ చరణ్ ను ఇప్పటివరకు చూసుంటారు. అయితే ఫస్ట్ టైం ‘ధృవ’ ద్వారా అందరికీ షాక్ ఇవ్వబోతున్నాడన్న విషయం ఇప్పటికే స్పష్టం కాగా, తాజాగా సోషల్ మీడియాలో చెర్రీ బాడీ బిల్డింగ్ కు సంబంధించిన పలు ఫోటోలు అభిమానుల అంచనాలను మరింత రెట్టింపు చేస్తున్నాయి.
కండలు తిరిగిన ఇలాంటి చెర్రీ ఫోటోలను చూసి ‘ఔరా’ అని నోరెళ్ళబెట్టడం మెగా అభిమానుల వంతవుతోంది. ‘ధృవ’ కోసం చెర్రీ ఎంతలా కష్టపడ్డారో అన్న దానికి నిదర్శనంగా నిలిచే ఈ ఫోటోలతో మెగా అభిమానులు సందడి చేస్తున్నారు. ఒక విధంగా ‘డబ్ల్యూడబ్ల్యూఈ’లో పాల్గొనే రెజ్లర్ల మాదిరి, చెర్రీ కండలు తిరిగిన శరీరం ఉండడం విశేషం. ఈ ఫోటోలలోనే ఇలా ఉంటే, రేపు వెండితెరపై చెర్రీని చూస్తే… ధియేటర్లలో మాస్ ప్రియుల హంగామాకు అవధులు ఉండవేమో!
ADVERTISEMENT
ADVERTISEMENT



