షాక్ – 340 కోట్లతో అత్యంత భారీ బడ్జెట్ సినిమా?

Ram Gopal Varma 340 Crore Budget Nuclear Movie ఓ ఇండియన్ సినిమాకు 340 కోట్ల బడ్జెట్టా? ఇదే నిజమైతే ఏ విధమైన కధతో ఈ సినిమా తెరకెక్కుతుంది? ఈ సినిమా దర్శకుడు ఎవరు? చిత్ర ప్రధాన తారాగణం ఎవరు? అన్న ప్రశ్నలు వడివడిగా వ్యక్తమవ్వడం సహజమే. అయితే ఆ కధాకమామీషు వింటే అవ్వాక్కవ్వాల్సిందే. ఎందుకంటే… ఈ సినిమాకు దర్శకుడు మరెవరో కాదు… వివాదాలకు, సంచలనకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ‘వన్ అండ్ ఓన్లీ’ రాంగోపాల్ వర్మ.

“న్యూక్లియర్” పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్ 340 కోట్లతో తెరకెక్కనుందని చెప్తూ ఈ పోస్టర్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. బహుశా దర్శకుడు, తారాగణం వంటి ఇతర విషయాలు కూడా సరిగా ఉన్నట్లయితే ఇది సంచలనంగా మారేదేమో గానీ, వర్మ దర్శకుడు అని చెప్పడంతో ఇదేదో కామెడీగా చెప్పినట్లు నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

ADVERTISEMENT

బహుశా వర్మ “న్యూక్లియర్” పేరుతో ఓ సినిమాను రూపొందించవచ్చు గానీ, బడ్జెట్ అయితే ఇది కాదని, దీనికి సంబంధించి మళ్ళీ ఏదో లింక్ ను తన క్రియేటివిటీతో ప్రతిబింబిస్తారని సినీ జనాలు చెప్పుకుంటున్నారు. అయితే విడుదల చేసిన పోస్టర్ మాత్రం వీక్షకులను ఆకట్టుకుంటోంది. మూడవ ప్రపంచ యుద్ధం ప్రారంభమవుతున్నట్లుగా ట్యాగ్ లైన్ వాడిన ఈ పోస్టర్ లో ఎడ్ల బండి, సైకిల్ మీద వెళ్ళే కుర్రాడు, పరిగెత్తే జనాలతో పోస్టర్ ను నింపి ఆకట్టుకున్నాడు. అయితే ఏ మాత్రం వాస్తవం ఉందో అన్న విషయం సదరు రచయిత సిరాశ్రీకే తెలియాలి.

ADVERTISEMENT
Latest Stories