లేటెస్ట్ వివాదం… ‘కడప’ను తిరగేస్తే ‘పడక’

Kadapaవివాదాలకు కేంద్ర బిందువు లాంటి వర్మ తాజాగా సృష్టిస్తున్న సంచలనం “కడప.” ఈ పేరుతో వెబ్ సిరీస్ ను ప్రారంభించనున్న వర్మ, ఇటీవల ట్రైలర్ విడుదల చేయగా, తాజాగా ఈ సినిమా టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేసారు. ‘రక్తచరిత్ర’ మాదిరి ఉన్న ఈ సాంగ్ లిరిక్స్ మరోసారి హాట్ టాపిక్ అయ్యే అవకాశం, మీడియాకు ఆహారంలా మారే సంకేతాలు పుష్కలంగా కనపడుతున్నాయి.

ADVERTISEMENT

“కడప కడప కడప కడప కడప కడప కడప
అది యమద్వారపు గడప
కడప కడప కడప కడప కడప కడప కడప
అది బలిపీటపు గడప
కడపంటే ఫ్యాక్షన్, కడపంటే యాక్షన్
కడపంటే ఓ టెన్షన్, కడపే అటెన్షన్
కడపంటే ఊరు కాదు… బాంబురా కొడకా
కడపంటే పేరు కాదు… మృత్యువురా కొడకా
కడపకెదిరి తొడగొడితే గోతిలోనే పడక
కడపను తిరగేస్తే పడక కానీ అది చావు కొడకా…!”

అంటూ సాగే లిరిక్స్ ను ప్రముఖ రచయిత సిరాశ్రీ రచించగా, రవి శంకర్ సంగీతం సమకూర్చారు. ముఖ్యంగా ఈ సాహిత్యంలో కడపను తిరగేస్తే పడక… అన్న పదాలు ఖచ్చితంగా హంగామా చేస్తాయని చెప్పడంలో తప్పులేదు. ‘రాయలసీమ రెడ్ల చరిత్ర’ అంటూ వర్మ చెప్పిన డైలాగ్ పై ఇప్పటికే వివాదాలు చెలరేగుతుండగా, తాజాగా ఇదొకటి తోడయ్యిందని చెప్పవచ్చు.

ADVERTISEMENT
Latest Stories