“రక్తచరిత్ర” బ్యాక్ టు ఫాం..!

Ram Gopal Varma Kadapa Web Series Trailer“రక్తచరిత్ర” బ్యాక్ టు ఫాం..! అవును… వర్మ తెరకెక్కించిన “రక్తచరిత్ర” సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిన విషయమే. అయితే సిల్వర్ స్క్రీన్ పై అన్ని చూపించడానికి సెన్సార్ నిబంధనలు అడ్డు రావడంతో కొన్నింటిని తొలగించి వర్మ తెరకెక్కించారు. కానీ వెబ్ మీడియాకు అలాంటి సెన్సార్ నిబంధనలు లేవు గనుక, తాజాగా “కడప” పేరుతో వెబ్ సిరీస్ ను ప్రారంభించారు.

దీనికి సంబంధించిన సిరీస్ 1 ట్రైలర్ ను కూడా విడుదల చేసారు. రాయలసీమలోని ప్రముఖ వ్యక్తులు కోట్ చేసిన విషయాలను ప్రస్తావిస్తూ రూపొందించిన ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే స్పందనను తెచ్చుకుంది. ఇది నాకు తెలిసిన కధ కాదు, అందరికి తెలిసిన నూటికి నూరుపాళ్ళు నిజమైన కధ… కాకపోతే ప్రాణభయంతో వారి పేర్లు, ఊరు పేర్లు మార్చాం అంటూ ఎంతో ఆసక్తికరంగా ట్రైలర్ ఓపెన్ అయ్యింది.

ADVERTISEMENT

ఇక ఫినిషింగ్ లో “ఇది రాయలసీమ రెడ్ల చరిత్ర” అనే డైలాగ్ తో ఫినిష్ చేసిన వర్మ, మరో సంచలనానికి తెరలేపినట్లే కనపడుతున్నారు. అలాగే డైలాగ్స్ విషయంలో ఎలాంటి సెన్సార్ లేకపోవడంతో… పచ్చి బూతులను నిరభ్యంతరంగా వినవచ్చు. మొత్తమ్మీద 4 నిముషాల నిడివి గల “కడప” ట్రైలర్ మరో “రక్తచరిత్ర”ను ప్రేక్షకులకు రుచిచూపించింది. అయితే దీనిని వర్మ నిజంగా విడుదల చేస్తారా? అనేది వేచిచూడాల్సిన అంశం.

ADVERTISEMENT
Latest Stories