ఉత్కంఠభరితంగా ‘పవన్ – వర్మ’ల మధ్య పోటీ!

pawan-kalyan-rgv-votingదర్శకుడు రాంగోపాల్ వర్మ సంచలనమైన ప్రకటనల గురించి అందరికీ తెలిసిందే. అయితే, ఈ సారి ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోనే పోటీపడ్డారు. అయితే ఇది ఎవరో పెట్టిన పోటీ కాదు, తనకు తానుగానే నిర్ణయించుకున్న పోటీ. మహేష్, తారక్, బన్నీ, ప్రభాస్, రవితేజ, చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ అభిమానులకు పిలుపునిస్తూ… “రాంగోపాల్ వర్మ, పవన్ కళ్యాణ్ లలో ఎవరు ఉత్తమమైన గాయకుడు?” నిస్పక్షపాతంగా చెప్పాల్సిందిగా కోరారు.

పవన్ కళ్యాణ్ సాంగ్ కోసం క్లిక్ చేయండి

ADVERTISEMENT

రామ్ గోపాల్ వర్మ సాంగ్ కోసం క్లిక్ చేయండి

ఓటింగ్ ముగియడానికి ఇంకా కొద్ది గంటల సమయం మిగిలి ఉన్న తరుణంలో ఇప్పటివరకు దాదాపుగా 7 వేల ఓట్లు పోలయ్యాయి. అయితే ఇద్దరి మధ్య పోటీ ఉత్కంఠభరితంగా సాగుతోంది. 49 శాతం ఓటింగ్ తో వర్మ ఉండగా, 51 శాతంతో పవన్ ముందంజలో ఉన్నాడు. ఈ ‘సింగింగ్’ పోటీ అమెరికాలోని ‘ట్రంప్ వర్సెస్ హిల్లరీ’ కన్నా ఆసక్తికరంగా ఉందంటూ వర్మ శిష్యుడు పూరీ జగన్నాధ్ తాజాగా ట్వీట్ చేసాడు. మరి ఈ పోటీలో ఎవరు గెలుస్తారో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.

ADVERTISEMENT
Latest Stories