వర్మ జీవితంలో ఫస్ట్ టైం… ఏం మెస్సేజ్ గురూ..!

ram-gopal-varma-social-media-post-on-500-1000-notesతనకు నచ్చింది తానూ చేయడమే తప్ప, ఇతరులను ఆ పని చేయండి, ఈ పని చేయండి… అంటూ ఎప్పుడూ చెప్పని దర్శకుడు రాంగోపాల్ వర్మ, తొలిసారిగా తన జీవితంలో ఒక సందేశాన్ని ఇచ్చారు. తానూ దర్శకత్వం వహించిన సినిమాను కూడా చూడమని చెప్పని వర్మ, దేశాన్ని పట్టిపీడిస్తున్న నల్లకుభేరులను ఉద్దేశించి ఒక సామాజిక సందేశాన్ని ఇవ్వడం మరింత ప్రాధాన్యతను సంతరించుకునేలా చేసింది.

“ఎ పబ్లిక్ సర్వీస్ మెస్సేజ్ ఫ్రం మీ అంటూ… చెల్లించాల్సిన పన్నులను క్రమపద్ధతిలో చెల్లించండి మరియు మీ దగ్గరున్న 500, 1000 రూపాయల నోట్లను వెంటనే మార్చుకోండి” అంటూ ఓ హాట్ హాట్ ఫోటోను పోస్ట్ చేసారు. కేవలం బ్రా మాత్రమే ధరించి ఉన్న హీరోయిన్ ‘లోఫర్’ ఫేం దిశా పటాని ఫోటోను పోస్ట్ చేసిన వర్మ, ఈ ఫోటోకు చేయాల్సిన పని ఏమీ సంబంధం లేదని తనదైన శైలిలో సందేశాన్ని ఇచ్చారు.

ADVERTISEMENT

ఈ రకమైన సోషల్ సందేశం దేశంలో ఇప్పటివరకు ఎవరూ ఇచ్చి ఉండకపోవచ్చు. అయితే ఏ రకమైన సందేశాన్ని అయినా మహిళల సౌందర్యాలను ప్రదర్శిస్తూ చెప్తే జనాలు చూస్తారని భావించారో ఏమో గానీ వర్మ చేసిన ఈ పోస్ట్ నెట్టింట్లో హాట్ హాట్ గా మారింది. ఎంతైనా వర్మ స్పెషాలిటీ వేరు కదా..!

ADVERTISEMENT
Latest Stories