రాంమాధవ్ కు మాతృవియోగం!

ram-madhav-Mother- passed away
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఇంఛార్జి రాంమాధవ్‌కు మాతృ వియోగం కలిగింది. ఢిల్లీలోని రాంమనోహర్‌ లోహియా ఆస్పత్రి (ఆర్‌ఎంఎల్‌) లో చికిత్స పొందుతూ జానకిదేవి బుధవారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు.

జానకిదేవి అంత్యక్రియలు రేపు (గురువారం) హైదరాబాద్‌లో అంత్యక్రియలు జరగనున్నాయి. రాంమాధవ్‌కు బీజేపీ నేతలు సంతాపం తెలిపారు. కర్ణాటకలో హంగ్ ఏర్పడటంతో రాంమాధవ్ అక్కడ కాంగ్రెస్, జేడిఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ దారికి తెచ్చే పనిలో ఉండగా ఈ వార్త తెలిసింది.

ADVERTISEMENT

ఇటువంటి వ్యవహారాలలో రాంమాధవ్ దిట్ట. గతంలో ఇటువంటి ఎన్నో సందర్భాలలో ఆయన పార్టీకి మద్దతుగా కీలక వ్యవహారాలు చక్కబెట్టారు. ఇటువంటి కీలక సమయంలో ఆయనకు ఇటువంటి ఇబ్బంది కలగడం పార్టీ శ్రేణులను నిరుత్సాహపరిచింది.

ADVERTISEMENT
Latest Stories