2019 ఎన్నికల ముందు జగన్ మోహన్ రెడ్డి మాయలో పడి కలియుగ దైవం ఏడుకొండల వెంకన్నబాబు ఆభరణాల పై అప్పటి టీడీపీ ప్రభుత్వం పై అనేక ఆరోపణలు చేసిన రమణ దీక్షితులు గారికి ఇన్నాళ్లకు కాదుకాదు ఇన్నేళ్లకు వైసీపీ అసలు రంగు అదేలెండి “పింక్” కాదు “బ్లూ” అనే వాస్తవం ఇప్పుడు స్పష్టత వచ్చినట్టుంది.
గత టీడీపీ ప్రభుత్వంలో వెంకన్న ఆభరణాల చిట్టాలో లేని ఒక పింక్ డైమండ్ పై చంద్రబాబు పై తీవ్రమైన ఆరోపణలు చేసి వెంకన్న భక్తులను ఆందోళనకు గురి చేశారు రమణ దీక్షితులు. ఈ ఆరోపణలను ఎదుర్కోవడంలో టీడీపీ కాస్త అలస్తవం వహించడంతో పార్టీకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అలాగే ఎన్నికల తరువాత పార్టీల మధ్య అధికార మార్పు జరగడంతో దీక్షితులుకు జరగాల్సిన లాభం కూడా జరిగినట్టే జరిగింది.
అయితే తన అవసరం ఉన్న మేరకే ఆ వ్యక్తిని ఉపయోగించుకుని తన లక్ష్యం పూర్తవగానే అది చెల్లైనా, తల్లైనా వారిని పక్కన పెట్టడం అలవాటైన జగన్ కు రమణ దీక్షితులు ఒక లెక్కా? అనే వాస్తవాన్ని అంగీకరించిన సదరు పండితులు గారు నేడు తిరుమల వెంకన్న దర్శనానికి రానున్న ప్రధాని మోడీ కి టీటీడీ లో జరుగుతున్న హిందుత్వ ధ్వంశాన్ని వివరిస్తూ ఒక ట్వీట్ పోస్ట్ చేశారు.
టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న పురాతన సాంప్రదాయ నిర్మాణాలను,వాటి చరిత్రను, సనాతన ధర్మాన్ని ఒక క్రమపద్ధతిలో నాశనం చేస్తున్న వారి కబంద హస్తాలలో హిందూ ధర్మం చిక్కుందని.,వారి చెర నుండి హిందుత్వాన్ని విడిపించి రాష్ట్రంలో హిందూ ధర్మాన్ని కాపాడాలంటూ నరేంద్ర మోడీకి తన ట్వీట్ ను పోస్ట్ చేశారు దీక్షితులు గారు.
అయితే గతంలో ముఖ్యమంత్రి జగన్ ను సాక్ష్యాత్తు శ్రీ మహా విష్ణువుతో పోల్చిన రమణ దీక్షితులలో ఇప్ప్పుడు అనుకోని ఈ మార్పుతో శ్రీవారి భక్తులు మొత్తానికి పండితుల వారికి ఆ మహా విష్ణువే కళ్ళ ముందున్న తెరను తొలగించి వాస్తవాలను గ్రహించేలా చేసారు అంటూ ఇప్పటికైనా తన పదవుల కోసం రాజకీయ నాయకుల మధ్య చేరి రాజకీయాలు చేయడం మానుకోవాలని దీక్షుతులకు హితవు పలుకుతున్నారు.ఓం నమో వెంకటేశాయా.
Realisation just dawned on Respected Ramana Deekshithulu Garu,
Suddenly realised Jagan‘s Govt is non-sanatani and systematically destroying ancient traditions and assets of Hindu Temples.#Tirumala pic.twitter.com/mzBBBSfB0d
— M9.NEWS (@M9Breaking) November 27, 2023




