కొన్ని రోజులుగా ఊరిస్తూ వచ్చిన రామాయణ్ ట్రైలర్ నిన్న ఉదయం అఫీషియల్ గా యూట్యూబ్ లో విడుదలైంది. కంటెంట్ గురించి, క్వాలిటీ గురించి, గ్రాఫిక్స్ గురించి రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొన్ని ఏకీభవించేలా ఉండగా, ఇంకొన్ని మరీ ఓవర్ గా కూడా ఉన్నాయి.
అయితే.. కామన్ గా అందరూ మాట్లాడుకుంటున్న విషయం మాత్రం “వారణాసి” గ్లింప్స్ రేంజ్ లో ట్రైలర్ క్వాలిటీ లేదు అనేది. ఒకరకంగా చెప్పాలంటే అది కచ్చితంగా ఒప్పుకోవాల్సిన విషయమే. అసలు AI అనేది వాడకుండా, కేవలం గ్రాఫిక్స్ తో రాజమౌళి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మామూలుది కాదు.
మరీ ముఖ్యంగా గ్లింప్స్ లో వచ్చే రాముడి సీక్వెన్స్ కి భీభత్సమైన క్రేజ్ వచ్చింది. ఆ పీక్ లెవల్ ను ఈమధ్యకాలంలో వచ్చిన ఏ భారీ గ్రాఫిక్స్ సినిమా కూడా అందుకోలేకపోయింది. అందుకు తాజా ఉదాహరణ “రామాయణ్” ట్రైలర్.
భారీ క్యాస్టింగ్, 2000 కోట్ల బడ్జెట్, ప్రపంచంలోనే అత్యుత్తమ గ్రాఫిక్స్ కంపెనీ ఉన్నప్పటికీ.. వారణాసి గ్లింప్స్ లో కనీసం 50% కూడా రామాయణ్ ట్రైలర్ అలరించలేకపోయింది. అప్పటికే కలరింగ్ & డీటెయిలింగ్ విషయంలో టీజర్ కి వచ్చిన ఫీడ్ బ్యాక్ ని సీరియస్ గా తీసుకొని టీమ్ చాలా మార్పులు చేసింది.
అయినప్పటికీ.. ఇలా రాజమౌళి “వారణాసి” స్థాయిలో ట్రైలర్ క్వాలిటీ లేదు, గ్రాఫిక్స్ లేవు అని మాట్లాడుకుంటున్నారు అంటే, దర్శకుడు రాజమౌళి భారీ గ్రాఫిక్ సినిమాల విషయంలో బార్ ను ఎంత ఎత్తుకి సెట్ చేశాడు అనేది అర్థం చేసుకోవచ్చు.
ఆ బార్ ను అందుకోవడం అనేది మళ్లీ రాజమౌళికి మాత్రమే సాధ్యమా? మధ్యలో ఎవరైనా ఆ స్థాయి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలరా? అనేది పెద్ద ప్రశ్న. అయితే.. ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ ఈ వారణాసి గ్లింప్స్ కంపేరిజన్ కి ప్రిపేర్ అయ్యే ఉండాలి అనేది మాత్రం నిజం.






