ఐఫాలో మెగా డాన్స్‌లు

Ramcharan dance performance for iifaఫిల్మ్‌ సెలబ్రెటీలు ప్రతిష్టాత్మకంగా భావించే ఐఫా అవార్డు వేడుక మొదటి సారి హైదరాబాద్‌లో జరుగబోతుంది. ఇప్పటికే ఈ అవార్డు వేడుకల కర్టన్‌ రైజింగ్‌ కార్యక్రమం పూర్తి అయ్యింది. వచ్చే నెలలో వైభవంగా జరుగబోతున్న ఈ కార్యక్రమానికి మెగా హీరో అల్లు శిరీష్‌ యాంకరింగ్‌ చేయబోతున్నట్లుగా నిర్వాహకులు ప్రకటించారు. తాజాగా ఈ కార్యక్రమం గురించి మరో ఆసక్తికర వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

ఈ కార్యక్రమంలో మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ డాన్స్‌ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. గతంలో చరణ్‌ ఏ వేదికపై కూడా డాన్స్‌ వేసింది లేదు. సినిమాల్లో తన డాన్స్‌లతో అదరగొట్టే చరణ్‌ మొదటి సారి స్టేజ్‌పై దుమ్ము రేపేందుకు సిద్దం అవుతున్నట్లుగా చెబుతున్నారు. చరణ్‌ ఇప్పటికే తన కెరీర్‌లో సూపర్‌ హిట్‌ అయిన రెండు పాటలతో పాటు, ఒక హిందీ పాటకు కూడా డాన్స్‌ను ప్రాక్టీస్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. మూడు పాటలతో మెడ్లీని చరణ్‌ అందిస్తాడట. మెగా ఫ్యాన్స్‌కు చరణ్‌ డాన్స్‌ ఖచ్చితంగా కిక్‌ ఇస్తుందని కార్యక్రమ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ వేడుకలో అవార్డులు ఎవరెవరు అందుకోబోతున్నారా అని ఆంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories