బీజేపీలో రాజకీయం… సోము వీర్రాజును పక్కన పెట్టారట!

ramdhev Madhav sidelined Somu Veerrajuముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఎప్పుడు విరుచుకుపడే బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు టీడీపీ బీజేపీ పొత్తు వీగిపోవడంతో పార్టీ అధ్యక్ష పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆయన పేరు బాగా ప్రచారం జరిగింది కూడా. అయితే ఇప్పుడు అనూహ్యంగా మజా మంత్రి మాణిక్యాల రావు పేరు ఖరారు అయినట్టుగా తెలుస్తుంది.

ADVERTISEMENT

దీనికి కారణం ఇటీవలే ఏపీ ఇంఛార్జిగా నియమితమైన రామ్ మాధవ్ అంట. సోము వీర్రాజుకు పార్టీ హై కమాండ్, సంఘ్ పరివార్ తో విస్తృతంగా సంబంధాలు ఉండటంతో తన ప్రాపకం కోసం కావాలనే సోము వీర్రాజు ను తప్పించి తనకు అనుకూలంగా ఉండే మాణిక్యాల రావు పేరు సిఫార్సు చేసినట్టు సమాచారం.

దీనితో సోము వీర్రాజు తనకు అన్యాయం జరిగిందని వాపోతూ ఆయన రగిలిపోతున్నట్టు సమాచారం. అయినా సరే తన వంతుగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై మరింతగా విమర్శలు చేసి పార్టీ హై కమాండ్ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారట వీర్రాజు. చూడాలి మరి అమిత్ షా ఆయనను కనికరిస్తారో లేదో.

ADVERTISEMENT
Latest Stories