రణరంగం ట్రైలర్… స్టైలిష్ డాన్ స్టోరీ

ranarangam-trailer-sharwanand-kajal-aggarwal-kalyani--priyadarshanయువ హీరో శర్వానంద్‌ నటిస్తున్న రణరంగం చిత్రం వచ్చే నెల 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల కాబోతుంది. ఎందుకనో ఈ సినిమా మీద మొదటి నుండి ప్రేక్షకులలో ట్రేడ్ లో పెద్దగా అంచనాలు లేవు. ప్రభాస్ నటించిన సాహూ సినిమా వాయిదా పడటంతో శర్వానంద్ కు మంచి డేట్ దొరికింది. దీనితో సినిమా టీం ప్రమోషన్స్ మొదలు పెట్టింది. దానిలో భాగంగా ఈ సినిమా ట్రయిలర్ ఈరోజు కాకినాడలో త్రివిక్రమ్ శ్రీనివాస్ చేతుల మీదుగా విడుదల చేశారు.

1983 లో ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చాక మద్యపాన నిషేధం విధించినప్పుడు అక్రమంగా మద్యం సప్లై చేసే ఒక డాన్ పాత్రలో శర్వానంద్ కనిపించాడు. నడివయస్కుడైన డాన్ పాత్రలో ఆయన ఒదిగిపోయారు. ట్రైలర్ లోని విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. సినిమా కథ గురించి ఎక్కువగా రెవీల్ చెయ్యకపోయినా ప్రామిసింగ్ గానే చూపించాడు దర్శకుడు. అయితే గతంలో సుధీర్ వర్మ చిత్రాల ట్రైలర్లన్నీ స్టైలిష్ గా ప్రామిసింగ్ గానే మొదట కనిపించేవి అయితే సినిమా విషయం వచ్చేటప్పటికీ ఫలితం తారుమారు అయ్యింది. చూడాలి ఈ సినిమా ఎలా ఉండబోతుందో.

ADVERTISEMENT

ఆగష్టు 15న రణరంగంతో పాటు అడివి శేష్ ఎవరు కూడా విడుదల కాబోతుంది. ఈ సినిమాకు ఇప్పటివరకూ హైప్ తక్కువ ఉన్న కారణంగా ఎవరు దీనికి గట్టి పోటీనే ఇస్తుంది. శర్వానంద్ తన చివరి సినిమా పడి పడి లేచే మనసుతో పెద్ద ప్లాప్ మూటగట్టుకున్నాడు. కావున ఈ సినిమాతో హిట్ కొట్టే ప్రయత్నంలో ఉన్నాడు. దర్శకుడు సుధీర్ వర్మ పరిస్థితి ఇంకా దారుణం… మొదటి సినిమా స్వామి రారా తరువాత ఆయన సరైన విజయాన్ని అందుకోలేకపోయారు. దీనితో ఆయనకు ఈ సినిమా కీలకంగా మారింది.

ADVERTISEMENT
Latest Stories