‘వినపడేట్టు కాదురా… కనపడేట్టు కొట్టండిరా..!’

ranga-ranga-rangasthalaana-rangasthalam-ram-charan‘ఎంత సక్కగున్నావే’ అంటూ మెలోడీ ప్రియులను, క్లాస్ వర్గాలను అలరించిన “రంగస్థలం”లోని మొదట పాటకు కొనసాగింపుగా విడుదలైన రెండవ పాట అనుకున్నట్లుగానే మాస్ మెగా అభిమానులను టార్గెట్ చేస్తూ విడుదలైంది. ‘రంగా రంగా రంగస్థలాన’ అంటూ సాగిన ఈ పాట మాస్ వర్గాలను విపరీతంగా ఆకట్టుకునేలా ఉంది. ‘వినపడేట్టు కాదురా… కనపడేట్టు కొట్టండిరా…’ రామ్ చరణ్ చెప్పిన డైలాగ్ తో మొదలైన డప్పులు పాట ఆద్యంతం కొనసాగుతాయి.

‘గంగంటే శివుడి గారి పెళ్ళామంట… గాలంటే హనుమంతుడి గారి నాన్న గారంట…’ అంటూ చంద్రబోస్ అందించిన సాహిత్యం వినసొంపుగా ఉండగా, రాహుల్ స్వరం మాంచి జోష్ ఫుల్ గా సాగుతుంది. ఊపుతో ఉన్న ఈ బీట్స్ అందించడంలో దిట్ట అయిన దేవిశ్రీ నుండి ఇలాంటి మ్యూజిక్ గతంలో చాలా సార్లు విన్నది కావడం నిరుత్సాహం కలిగించే అంశం. అయితే సిల్వర్ స్క్రీన్ పై రామ్ చరణ్ డ్యాన్స్ లకు మంచి స్కోప్ ఉన్న పాటగా ఈ ‘రంగా రంగా రంగస్థలాన’ను పేర్కొనవచ్చు.స్తోంది.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories