ఎన్నాళ్ళయ్యుంటుంది… ఇలా ఒక హీరోను చూసి..!

Rangasthalam 1985 Movie First Look - Release Dateగళ్ళ లుంగీ… మెడలో కండువా… బట్టన్స్ తీసేసిన షర్టు… ఇలా మన తెలుగు హీరోను చూసి ఎన్నాళ్ళు అయ్యుంటుంది. బహుశా సూపర్ స్టార్ కృష్ణ హయంలో కావచ్చు. నాడు ‘కిరాయి కోటిగాడు, కృష్ణావతరం’ వంటి అనేక సినిమాలలో ఈ తరహాలో కనిపించిన కృష్ణకు తెలుగు ప్రేక్షకులు నీరాజనం పలికారు. ఆ తర్వాత అంత గ్రామీణ వాతావరణంలో ఆ తరహా మాస్ క్యారెక్టర్స్ చేసిన హీరోలు లేరు.

తెలుగు ప్రేక్షకులకు దూరమైన ఆ “ఫ్లేవర్”ను సుకుమార్ “రంగస్థలం” ద్వారా మరోసారి ప్రేక్షకులకు రుచి చూపించబోతున్నారని ఈ సినిమా ‘ఫస్ట్ లుక్’ పోస్టర్ స్పష్టం చేసింది. బ్యాక్ గ్రౌండ్ లో పల్లెటూరు వాతావరణం… గళ్ళ లుంగీ… ఎర్ర బనియన్ తో జోష్ ఫుల్ గా కనిపిస్తున్న చెర్రీ లుక్ అదిరిపోయింది. ఫస్ట్ లుక్ లోనే విమర్శకుల చేత ‘శభాష్’ అనిపించుకుంది ‘రంగస్థలం’ పోస్టర్.

ADVERTISEMENT

ఈ సినిమా కధ 1985వ దశకానికి చెందినది కావడంతో, టైటిల్ లోగో కూడా అదే తరహాలో రూపొందించారు. మార్చి 30వ తేదీన విడుదల అని కూడా ధృవీకరించడంతో… సమ్మర్ ఫీస్ట్ గా టాలీవుడ్ ప్రేక్షకులను అలరించడం ఖాయంగా కనపడుతోంది. మాస్ మెగా ఫ్యాన్స్ కు విజువల్ ట్రీట్ తో పాటు… సినీ అభిమానులకు గుర్తుండిపోయే చిత్రంగా సుకుమార్ రూపొందిస్తున్నారని ఆశిద్దాం.

ADVERTISEMENT
Latest Stories