“రంగస్థలం”కు మెగాస్టార్ దిద్దిన ‘రంగులు?’

Unknown woman Sridevi hulchal at chiranjeevi residenceసుకుమార్ దర్శకత్వం వహిస్తోన్న ‘రంగస్థలం’ సినిమా షూటింగ్ దాదాపుగా చివరిదశకు చేరుకుంది. దీంతో ఇప్పటివరకు షూటింగ్ జరిగిన సినిమాను మెగాస్టార్ చిరంజీవి ఇటీవల చూశారట. 1985 కాలానికి సంబంధించిన కథా నేపథ్యంలో… గ్రామీణ ఇతివృత్తంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చరణ్ – సమంతలు జంటగా నటించనున్న విషయం తెలిసిందే.

సినిమాలో డీ గ్లామర్ అంశాలు ఎక్కువగా వున్నాయని, వాటిని కాస్త తగ్గించమని సుకుమార్ కు సూచించినట్లుగా ట్రేడ్ టాక్. చిరు రంగంలోకి దిగడంతో మళ్ళీ రీ షూట్ లకు వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదనేది అసలు విషయం. ఇక ఈ సినిమా కథ గతంలో తాను చేసిన ‘ఊరికిచ్చిన మాట’ ఛాయల్లో ఉండటాన్ని కూడా చిరంజీవి గమనించారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories