సమంత కోసం స్పెషల్ గా దించుతున్నారు!

Rangasthalam-Samantha-Launch“రంగస్థలం” సినిమా తొలి టీజర్ లో కేవలం రామ్ చరణ్ ‘చిట్టిబాబు’ పాత్రను మాత్రమే చూపించడంతో… హీరోయిన్ సమంత అభిమానులు నిరాశ చెందిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి సమంత ఓ ఫోటోను కూడా లైక్ చేయడంతో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ కూడా అయ్యింది. బహుశా అందుకేనేమో గానీ, సమంత పోషించిన ‘రామలక్ష్మి’ పాత్రను ప్రత్యేకంగా విడుదల చేస్తోంది చిత్ర యూనిట్.

శుక్రవారం ఉదయం 11 గంటలకు ‘రంగస్థలం’లోని సమంత పోషించిన రామలక్ష్మి పాత్రను పరిచయం చేయబోతున్నామని చిత్ర యూనిట్ ఓ సందేశం పంపింది. అయితే ఇది పోస్టర్ రూపంలోనా? లేక టీజర్ రూపంలోనా? అన్నది మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఆల్ రెడీ పోస్టర్ ను రిలీజ్ చేయడంతో, బహుశా సమంతకు సంబంధించిన ఎక్స్ క్లూజివ్ టీజర్ విడుదల కావచ్చని సినీ వర్గాల సమాచారం.

ADVERTISEMENT

చెర్రీని చెవిటి వ్యక్తిగా చూపించిన సుకుమార్, హీరోయిన్ సమంతను మూగమ్మాయిగా చూపించారన్న టాక్ ఉంది. దీంతో సమంత టీజర్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలుగు సినిమాలో హీరోహీరోయిన్లు అంగ వైకల్యంతో కూడిన పాత్రలను పోషించడం అనేది చాలా అరుదుగా జరిగే అంశం. గత రెండు, మూడు దశాబ్దాలలో బాలకృష్ణ “భైరవద్వీపం” ఒక్కటే గుర్తుకు వస్తుంది తప్ప, ఇతర నటీనటులంతా రెగ్యులర్ రోల్స్ ను మాత్రమే చేసారు.

ADVERTISEMENT
Latest Stories