ట్రైలర్ టాక్ – రొటీన్ ఫన్… అంతే..!

Rangula-Raatnam-Trailer--Raj-Tharunరెండు పెద్ద సినిమాల మధ్యలో విడుదలై హిట్ కొట్టడం శర్వానంద్ కు పరిపాటిగా మారిన నేపధ్యంలో… ఈ సారి ఆ రూట్ ను రాజ్ తరుణ్ ఎంచుకున్నాడు. గత సంక్రాంతికి ‘ఖైదీ నంబర్ 150’ మరియు ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాల నడుమ విడుదలై బంపర్ హిట్ కొట్టిన ‘శతమానం భవతి’ మాదిరిగానే ఈ ఏడాది సంక్రాంతికి ‘అజ్ఞాతవాసి’ మరియు ‘జై సింహా’ల నడుమ విడుదలకు సిద్ధమైంది ‘రంగుల రాట్నం.’ అన్నపూర్ణ స్టూడియోస్ పై నిర్మాణం జరుపుకున్న ఈ సినిమా ధియేటిరికల్ ట్రైలర్ ను తాజాగా విడుదల చేసారు.

రాజ్ తరుణ్, చిత్రశుక్ల జంటగా నటించిన ఈ సినిమా ట్రైలర్ ఫన్నీగా ఉంది. కొత్తగా ఏమీ లేకపోయినప్పటికీ ‘టైం పాస్ ఎంటర్టైనర్’గా మారుతుందేమో అన్న అనుభూతిని ఈ ట్రైలర్ మిగిల్చింది. ముఖ్యంగా ఒకే అంశంపై మదర్ అండ్ వైఫ్ లతో సంభాషించే విధానం సహజత్వానికి దగ్గరగా ఉండడంతో సన్నివేశాలు పండినట్లుగా కనిపించాయి. అయితే రాజ్ తరుణ్ నటన మాత్రం మొదటి సినిమా నుండి ఇదే తరహాలో ఉండడం విమర్శలకు తావిచ్చే అంశం. అయితే ఈ సంక్రాంతి పండగ సీజన్ కాబట్టి… ప్రేక్షకుల నుండి ఆమోదముద్ర వేయించుకోవడం పెద్ద కష్టమైన విషయమేమీ కాదు.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories