‘బాద్ షా’ మరో హీరోయిన్ కు ఎంగేజ్ మెంట్?

Ranveer Singh Ready to Take the Jump for Top Deepika Padukone‘బాలీవుడ్ బాద్ షా’ షారుక్ ఖాన్ తో పరిచయం అయిన అనుష్క శర్మ ఇటీవలే విరాట్ కోహ్లితో ఏడడుగులు వేసిన విషయం తెలిసిందే. ఇదే కోవలో షారుక్ తో బాలీవుడ్ చిత్ర సీమకు పరిచయం అయిన మరో ముద్దుగుమ్మ దీపికా పదుకునే కూడా ఎట్టకేలకు రణవీర్ సింగ్ తో ఎంగేజ్ మెంట్ కు సిద్ధమైందనే వార్త జాతీయ మీడియాలో ప్రాధాన్యతను దక్కించుకుంది. దీపికా పుట్టినరోజు అయినటువంటి జనవరి 5వ తేదీ ఇందుకు వేదిక కానుందని ఈ వార్తల సారాంశం.

కొత్త సంవత్సర వేడుకలను మాల్దీవుల్లో సెలబ్రేట్ చేసుకున్న దీపికా – రణవీర్ లు, ఈ శుక్రవారం నాడు నిశ్చితార్ధం చేసుకోబోతున్నారని, గత వారం రోజులుగా ఇరువురి కుటుంబాలు కూడా మాల్దీవుల్లోనే ఉన్నాయని, దీంతో ఈ సారి హల్చల్ చేస్తున్న ఎంగేజ్ మెంట్ వార్తలు పక్కా అన్న టాక్ హల్చల్ చేస్తోంది. ఈ 5వ తేదీతో 32వ ఏట అడుగుపెడుతున్న దీపికా, నిశ్చితార్ధం జరిగితే అయిదేళ్ళ వీరి డేటింగ్ కు బ్రేక్ పడినట్లే. అంతేకాకుండా అతి త్వరలోనే వీరి పరిణయం కూడా ఉంటుందన్న సమాచారం కూడా అందుతోంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories