రష్మికా మంచి ప్రయత్నమే కానీ…కల్పితమటగా?

Rashmika Mandanna Awareness About Water Pollutionబెంగళూరు మహా నగరం కాలుష్యంలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నట్లు అందరికీ తెలిసిందే. అయితే అందులో ముఖ్యంగా బెల్లందూరు లేక్ మరింత కాలుష్యంతో కూడుకోవడంతో దానిలో దిగి ఒక ఫోటో షూట్ చేసి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి అని గీత గోవిందం భామ రష్మికా మాదన్నా ఆ లేక్ లో దిగి మరీ ఫోటో షూట్ చేసింది అని అందరూ ప్రశంసించారు.

[m9ad]

ADVERTISEMENT

కొందరు అయితే ఎంత ప్రజల్లో చైతన్యం కోసం అయితే మాత్రం అంత రిస్క్ అవసరమా అన్న మాటలు కూడా బలంగా వినిపించాయి. మరి కొందరు ఆ నీటిలో చాలా ప్రమాధాకరమైన వాయువులు, కెమికల్స్ ఉన్నాయి అని, వాటి వల్ల ఆమె ప్రాణానికే ప్రమాధమని ఫీల్ అయ్యారు కూడా. అయితే అందరూ నిజమేనేమో అని తెగ ఫీల్ అయిపోయిన క్రమంలో అసలు నిజం తాపీగా బయటకు వచ్చింది.

ఇంతకీ అసలు విషయం ఏంటి ఆ ఫోటో షూట్ అనేది నిజమే….కానీ అది అక్కడ అదే…ఆ బెల్లందూరు లేక్ వద్ద కాదు చేసింది. అది చేసింది ఒక రిసార్ట్ లోని స్విమ్మింగ్ పూల్ లో చేశారట. అక్కడ ఉపయోగించిన నీళ్ళు కూడా మంచివే అని, ఆ ఫోటో కనిపిస్తున్న నురగ, ఆ కాలుష్యానికి సంభందించిన వాతావరణం అంతా ఫోటో షాప్ తోనే అని తెలిపోయింది. ఏది ఏమైనా ప్రజల్లో చైతన్యం కోసం ఆమె చేసిన ఈ పనిని అభినందించాల్సిందే.

ADVERTISEMENT
Latest Stories