మాస్ మహారాజా రవితేజ తాజా చిత్రంగా వచ్చే నెల 2వ తేదీన ‘టచ్ చేసి చూడు’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో రవితేజ బిజీగా వున్నాడు. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ ఉండగా, మీరు చేసే సినిమాలు ఒకేలా ఉంటున్నాయనీ… ఒకే తరహాగా అనిపిస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
దీనిపై తనదైన శైలిలో స్పందిస్తూ .. “కొత్తగా అనిపించాలనే ఉద్దేశంతో ప్రయోగాలు ఎందుకు చేయాలి?” అంటూ రవితేజ అడిగారు. గతంలో నేను ‘శంభో శివ శంభో’ .. ‘నేనింతే’ .. ‘ నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్’ వంటి సినిమాల్లో ఛాలెంజింగ్ రోల్స్ చేశాను. కానీ అవేమీ పెద్దగా ఆడలేదు.
జనాలు నన్ను ఎలా చూడాలనుకుంటున్నారో .. వాళ్లకి నేను అలాగే కనిపించాలని నిర్ణయించుకున్నాను. నా మార్క్ లో నేను సినిమాలు చేయకపోతే అవి ఆడటం లేదు. ప్రయోగాల పేరుతో ముందుకు వెళితే రిజల్ట్ తేడా కొట్టేస్తోందని రవితేజ చెప్పుకొచ్చారు. దీంతో తన నుండి ప్రయోగాత్మకమైన సినిమాలు ఆశించవద్దని మాస్ మహారాజా స్పష్టం చేశాడు.



