‘జూనియర్ ఎన్టీఆర్’ సన్నిహితులతో ‘రవితేజ’ సినిమా!

Ravi Teja  Vikram Sirikonda, Ravi Teja  Vikram Sirikonda Movie Updates, Ravi Teja  New Movie Vikram Sirikonda Direction, Ravi Teja Vikram Sirikonda Movieసినిమా సినిమాకు అస్సలు గ్యాప్ అంటే ఇష్టం ఉండని మాస్ మహారాజా రవితేజ, గత సంవత్సర కాలంగా ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. మధ్యలో దిల్ రాజుతో ప్రారంభించిన సినిమాకు ఆదిలోనే బ్రేకులు పడగా, అప్పటి నుండి కధలు మాత్రమే వింటున్న రవితేజ, ఎట్టకేలకు ఓ సినిమాకు సంబంధించిన అధికారిక సమాచారం అందించారు. మరో విశేషం ఏమిటంటే… ఈ సినిమాకు జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితుడు వల్లభనేని వంశీ సమర్పకునిగా వ్యవహరిస్తుండడం.

‘కొంచెం ఇష్టం, కొంచెం కష్టం, రేసుగుర్రం’ సినిమాలకు స్క్రీన్ ప్లే అందించిన విక్రమ్ సిరి దర్శకుడిగా పరిచయం చేస్తూ నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కు మరో సన్నిహితుడు అయిన రచయిత వక్కంతం వంశీ ఈ సినిమాకు కధను అందించారు. రవితేజ కోసం మాంచి పవర్ ఫుల్ కధను అందించారని నిర్మాత బుజ్జి ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు.

ADVERTISEMENT

ఇక, ఈ చిత్రానికి సంబంధించిన హీరోయిన్, ఇతర తారాగణం, సాంకేతిక విభాగం ఎంపిక జరగాల్సి ఉంది. మొత్తానికి మాస్ మహారాజా అభిమానులకు ఒక తీపి కబురును అందించడంలో సక్సెస్ అయిన రవితేజ, ఈ సినిమాను ఎప్పటికీ పూర్తి చేస్తారో తెలియాలి. ఓ పక్కన ఇతర హీరోలంతా జెట్ స్పీడ్ లో దూసుకెళ్తుండా, ఎప్పుడూ సూపర్ స్పీడ్ లో ఉండే రవితేజ బాగా నెమ్మదించి, ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories