కలిసి రాని రోజున కుల అస్త్రం సంధించిన వైఎస్సార్ కాంగ్రెస్

Rayapati Sambasiva Raoనిన్నటి రోజు వైఎస్సార్ కాంగ్రెస్ కు అసలు కలిసి రాలేదు. నిన్న ఒక్క రోజే మూడు విషయాలలో ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగిలాయి. హై కోర్టు ఇంగ్లీష్ మీడియం జీఓలను రద్దు చేసింది, జగన్ ప్రభుత్వం హాట్ స్పాట్లను రెండు జిల్లాలకు పరిమితం చెయ్యాలి అనుకుంటే తొమ్మిది జిల్లాలుగా ప్రకటించింది కేంద్రం, చివరిగా మాజీ ఎన్నికల అధికారి రమేష్ కుమార్ జగన్ ప్రభుత్వం మీద కేంద్రానికి రాసినట్టుగా చెబుతున్న లేఖను తానే రాసా అని మీడియాకు తెలిపారు ఆయన.

వరుస ఎదురుదెబ్బలతో ఇబ్బంది పడిన అధికార పార్టీ రాత్రికి తెలుగుదేశం పార్టీపై కుల అస్త్రం ప్రయోగించింది. ఒక టీవీ ఇంటర్వ్యూలో మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు జగన్ ప్రభుత్వం కమ్మ వారిని కావాలని టార్గెట్ చేస్తుందని, అర్హులైనా అన్ని చోట్లా వారిని పక్కన పెడుతుందని, దీని గురించి కమ్మ వారు మాట్లాడకపోవడం దారుణం అని చెప్పుకొచ్చారు.

ADVERTISEMENT

అయితే వైఎస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ మాత్రం ‘కమ్మ వారు తలుచుకుంటే జగన్ ని లేపేస్తారు’ అని అన్నారని సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం చేసింది. అసలు అటువంటి ప్రస్తావనే లేకపోయినా కేవలం ప్రభుత్వ వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మరలించడానికే ఈ ప్రయత్నం చేసిందని టీడీపీ ఆరోపిస్తుంది.

“జగన్ తండ్రి వైఎస్ నాకు మంచి సన్నిహితుడు. కమ్మవాళ్ళు తలచుకుంటే జగన్ రెడ్డి లేచిపోతాడని నేను వ్యాఖ్యానించలేదు. సీఎం స్థాయి వ్యక్తి తరచూ కులాల ప్రస్తావన తేవడం నన్ను బాధించింది. నేను అనని మాటలు అన్నట్లు ప్రచారం కావడంతో రాత్రి నుంచి వందలాది బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా నాపై అసభ్యంగా వ్యాఖ్యలు పెడుతున్నారు’ అని రాయపాటి చెప్పుకొచ్చారు.

ADVERTISEMENT
Latest Stories